News March 12, 2025
రానున్న 24 గంటల్లో ఆ జిల్లాల్లో వర్షాలు

AP: బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. 19 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయంది. మరోవైపు, ఉపరితల ద్రోణి వల్ల నిన్న TNతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే. రాయలసీమలోని మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా మేఘాలు ఆవరించి కనిపించాయి.
Similar News
News December 10, 2025
VJA: భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లపై ఇన్ఛార్జ్ కలెక్టర్ సమీక్ష

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమ ఏర్పాట్లను ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్. ఇలక్కియా బుధవారం పరిశీలించారు. దాదాపు 6 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసినట్లు తెలిపారు. భక్తుల భద్రత, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ఆర్డీవో, ఈవో, పోలీసు అధికారులతో కలిసి ఆమె క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు.
News December 10, 2025
చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరమంటే?

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.
News December 10, 2025
మరోసారి ఇండిగో విమానాల రద్దు

ఇండిగో విమానాల రద్దు మళ్లీ మొదలైంది. ఇవాళ దేశవ్యాప్తంగా సుమారు 300 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ ఎయిర్పోర్టులో 137, ముంబైలో 21, బెంగళూరులో 61 ఫ్లైట్స్ నిలిచిపోయాయి. శంషాబాద్ నుంచి బయల్దేరాల్సిన 70 విమానాలు కూడా రద్దయినట్లు తెలుస్తోంది. తీవ్ర సంక్షోభం తర్వాత తమ ఫ్లైట్స్ సర్వీసెస్ సాధారణ స్థితికి చేరాయని నిన్న ఇండిగో సీఈవో పీటర్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరోసారి విమాన సర్వీసులు రద్దయ్యాయి.


