News July 22, 2024
వానలే.. వానలు.. TDP, కాంగ్రెస్‌పై అపవాదు పోయినట్టేనా?
‘కాంగ్రెస్ అంటేనే కరవు’.. ‘చంద్రబాబు ఉంటే వర్షాలే పడవు’ ఈ వ్యాఖ్యలను ప్రతిపక్షాల నుంచి తరచూ వింటుంటాం. కానీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. TDP, INC అధికారం చేపట్టిన తొలి సీజన్‌లోనే వర్షాలు దంచికొడుతున్నాయి. కృష్ణా, గోదావరి పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాజెక్టులు నిండుతున్నాయి. వాగులు పొంగుతున్నాయి. దీంతో ఆరోపణలకు సమాధానమిదే అంటూ TDP, INC కౌంటర్ ఇస్తున్నాయి.
Similar News
News January 27, 2025
కిడ్నీ రాకెట్.. ప్రధాన సూత్రధారి అరెస్ట్
TG: సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి డాక్టర్ పవన్ అలియాస్ లియోన్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి పారిపోయిన అతడితో పాటు మరో వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిలో అక్రమంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసి, ఒక్కో సర్జరీకి రూ.50-60లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. తీవ్రత దృష్ట్యా ఈ కేసును ప్రభుత్వం CIDకి అప్పగించింది.
News January 27, 2025
స్టాక్‌మార్కెట్లు విలవిల.. నిఫ్టీ 23,000 సపోర్టు బ్రేక్
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 22,955 వద్ద చలిస్తోంది. కీలకమైన 23,000 సపోర్ట్ జోన్‌ను బ్రేక్ చేసింది. మరోవైపు సెన్సెక్స్ 440 పాయింట్లు పతనమై 75,774 వద్ద కొనసాగుతోంది. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 6.44% పెరిగి 17.83 వద్దకు చేరుకుంది. FMCG మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. BRITANNIA, HUL, ITC, ICICIBANK, NESTLE IND టాప్ గెయినర్స్.
News January 27, 2025
అమల్లోకి ‘ప్రత్యేక’ పాలన
TG: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పాలకవర్గాల పదవీకాలం నిన్నటితో ముగిసింది. దీంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈనెల 28తో కరీంనగర్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు కూడా ముగియనుంది. GHMC, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, మరికొన్ని మున్సిపాలిటీల పదవీకాలం మరో ఏడాది ఉంది.