News October 6, 2025

నేడూ కొనసాగనున్న వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగుతాయని IMD తెలిపింది. ఏపీలోని ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద నిలబడొద్దని సూచించింది. అటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

Similar News

News October 6, 2025

APPLY NOW: రైట్స్‌లో 11 పోస్టులు

image

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్(రైట్స్) 11 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 9వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 55ఏళ్లు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముందుగా అప్లై చేసుకున్న వారికి ఈనెల 8 నుంచి 10వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://rites.com/

News October 6, 2025

నేవీ అమ్ములపొదిలోకి ‘ఐఎన్ఎస్ ఆండ్రోత్’

image

ఇండియన్ నేవీలో ఇవాళ మరో యుద్ధ నౌక చేరనుంది. శత్రు దేశాల సబ్‌మెరైన్ల ఉనికిని పసిగట్టేందుకు విశాఖలోని నేవల్ డాక్‌యార్డులో ‘ఐఎన్ఎస్ ఆండ్రోత్’ జలప్రవేశం చేయనుంది. నేవీకి ఇది రెండో యాంటీ సబ్‌మెరైన్ వాటర్‌ఫేర్ షాలోవాటర్ క్రాఫ్ట్. అత్యాధునిక తేలికపాటి టార్పెడోలు, సబ్‌మెరైన్ల విధ్వంసక రాకెట్లతో దాడి చేయగలదు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఈ నౌక తయారీకి 80% స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించారు.

News October 6, 2025

యాక్షన్ దిశగా ప్రభుత్వం.. రెడీ అంటున్న విజయ్

image

కరూర్ తొక్కిసలాటపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహంతో తమిళనాడు ప్రభుత్వం విజయ్‌పై చర్యలకు సిద్ధమవుతోంది. నిందితుడిగా కేసు పెట్టడం, దుర్ఘటనకు కారకుడిగా చేయడం సహా ఇతర అంశాలు పరిశీలిస్తోంది. అటు ఏ నిర్ణయం తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధమని TVK నేతల భేటీలో విజయ్ పేర్కొన్నారు. ‘41 మంది చనిపోతే సుమోటో కేసుతో ఇద్దరు కిందిస్థాయి నేతల అరెస్టులేనా? విజయ్‌పై చర్యలు తీసుకోరా? అని ప్రభుత్వాన్ని HC గతవారం ప్రశ్నించింది.