News July 10, 2024
HYDలో వర్షపునీటి సమస్యకు త్వరలో చెక్!

TG: హైదరాబాద్‌లో వర్షాకాలం నీరు నిలిచే ప్రాంతాల్లో సంపుల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 140 ప్రాంతాల్లో నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. ముందుగా రూ.20 కోట్లతో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ సర్కిళ్ల పరిధిలోని 11 ప్రాంతాల్లో సంపులు నిర్మించనుంది. ఒక్కో సంపు సామర్థ్యం 10 లక్షల లీటర్ల ఉంటుంది. వీటి నిర్మాణం కోసం అనువైన స్థలాలను అధికారులు గుర్తిస్తున్నారు.
Similar News
News December 17, 2025
RBI 93 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 93 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, పీహెచ్డీ, సీఏ, CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://rbi.org.in/
News December 17, 2025
ఆస్కార్ 2026 షార్ట్‌లిస్ట్‌లో ‘హోమ్‌బౌండ్’

భారతీయ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్‌బౌండ్’ మూవీ 98వ అకాడమీ అవార్డులలో ‘ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో టాప్-15లో చోటుదక్కించుకుంది. కేన్స్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఆస్కార్ రేసులోకి దూసుకెళ్లింది. పోలీస్ అవ్వాలనుకునే ఇద్దరు స్నేహితులకు ఎదురైన సవాళ్లే ఈ మూవీ కథ.
News December 17, 2025
రూ.లక్ష రుణం పొందడానికి అర్హతలు ఏమిటి?

AP: కౌలు రైతులు రూ.లక్ష వరకు రుణం పొందాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారులు జారీ చేసిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం ఉంటూ, వాటిలో సభ్యులై ఉండాలి. సొంత ఇల్లు ఉన్నవారికి ఈ రుణంలో ప్రాధాన్యత ఇస్తారు. కౌలు పత్రంలో సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. రుణం పొందిన రోజు నుంచి ఏడాది లోపు అసలు, వడ్డీతో కలిపి రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.


