News July 13, 2024
వర్షాకాలం.. ఈ జాగ్రత్తలు పాటించండి!

వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం మర్చిపోకండి.
* స్ట్రీట్ ఫుడ్ కలుషితమయ్యే అవకాశం ఎక్కువ. దానికి దూరంగా ఉండండి.
* ఇంటిని తరచూ శుభ్రం చేసుకోండి.
* కాచి చల్లార్చిన నీరు, వేడి ఆహారం తీసుకోండి.
* సీ ఫుడ్‌కు కాస్త విరామం ఇవ్వడం మంచిది.
* వర్షంలో తడిస్తే తప్పనిసరిగా స్నానం చేయండి.
>> SHARE
Similar News
News November 29, 2025
HYD: కార్యచరణ త్వరలో ప్రకటిస్తాం: రాంచందర్ రావు

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ORR పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై చర్చించేందుకు సమావేశం నిర్వహించమన్నారు. ప్రజలకు భారంగా మారే ఈ విలీనంపై కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామన్నారు.
News November 29, 2025
ఈ ఫైనాన్స్ జాబ్స్‌తో నెలకు రూ.లక్షపైనే జీతం

భారతదేశ ఫైనాన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నుంచి ఫిన్‌టెక్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఎంట్రీలెవల్లోనే నెలకు రూ.లక్షపైనే జీతం ఆఫర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో అత్యధికంగా M&A అనలిస్ట్‌కు ఏడాదికి రూ.30 లక్షల వరకు, ఫిన్‌టెక్ ఫైనాన్షియల్ అనలిస్టుకు ఏడాదికి రూ.20 లక్షల వరకు, రిస్క్ మేనేజ్మెంట్లో క్వాంట్ రిస్క్ అనలిస్టుకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు.
News November 28, 2025
ఆధార్ యాప్.. మొబైల్ నంబర్ ఇలా అప్డేట్ చేసుకోండి!

మొబైల్ యాప్ ద్వారా ఆధార్ కార్డుకు లింకైన <<18410970>>మొబైల్ నంబర్‌ను<<>> అప్డేట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ప్లే స్టోర్‌లో ‘Aadhaar’ యాప్ డౌన్లోడ్ చేసుకుని లాగిన్ కావాలి. My Aadhar Updatesపై క్లిక్ చేస్తే మొబైల్ నంబర్, అడ్రస్, పేరు, ఈమెయిల్ ఐడీ అప్డేట్స్ అని కనిపిస్తాయి. ప్రస్తుతానికి మొబైల్ నంబర్ అప్డేట్ మాత్రమే పని చేస్తోంది. రూ.75 చెల్లిస్తే 5 నిమిషాల్లో రిక్వెస్ట్ వెళ్తుంది.


