News August 19, 2024
‘రైతు భరోసా’ ఎన్ని ఎకరాలలోపు అంటే?
TG: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.7,500 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విధివిధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. మేధావుల సూచనలతో 10 ఎకరాల లోపు వారికి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్‌కు, IAS, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై మరో 20 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
Similar News
News January 23, 2025
అక్బర్, ఔరంగజేబు గురించి మనకెందుకు: అక్షయ్ కుమార్
దేశంలో చరిత్ర పుస్తకాలను మార్చాల్సిన అవసరం ఉందని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ హిస్టరీ బుక్స్‌లో అక్బర్, ఔరంగజేబు గురించి చదువుకోవడం అవసరమా అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన ‘స్కై ఫోర్స్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ‘చరిత్రలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ల గురించి పాఠాలు ఉండాలి. పరమవీరచక్ర అవార్డు పొందిన వారి కథనాలు ప్రచురించాలి’ అని పేర్కొన్నారు.
News January 23, 2025
భార్యను ముక్కలుగా నరికిన భర్త.. కారణం ఇదే!
TG: జిల్లెలగూడలో మాధవి <<15230164>>హత్య కేసులో<<>> పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన మాధవి సంక్రాంతికి పుట్టింటికి వెళ్తానని అడగ్గా భర్త గురుమూర్తితో గొడవ జరిగిందని చెప్పారు. ఆ కారణంతోనే భార్యను చంపినట్లు భావిస్తున్నారు. డెడ్ బాడీని ముక్కలుగా నరికి, కుక్కర్లో ఉడికించి చెరువులో పడేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణలో వెల్లడించాడు. గురుమూర్తికి వేరే మహిళతో సంబంధం ఉందని కూడా అనుమానిస్తున్నారు.
News January 23, 2025
త్వరలోనే రాష్ట్రానికి కాగ్నిజెంట్: లోకేశ్
AP: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే శుభవార్త రాబోతుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దావోస్‌లో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్‌తో ఆయన సమావేశమయ్యారు. ‘రాష్ట్రంలోని వైజాగ్, విజయవాడ, తిరుపతిలో భారీగా కోవర్కింగ్ స్పేస్ ఉంది. కాగ్నిజెంట్ విస్తరణలో భాగంగా ఇక్కడ కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరాం. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆ సంస్థ సీఈఓ తెలిపారు’ అని పేర్కొన్నారు.