News December 11, 2024

మోదీని కలిసిన రాజ్ కపూర్ ఫ్యామిలీ

image

దిగ్గజ హిందీ నటుడు రాజ్ కపూర్ కుటుంబ సభ్యులు ప్రధాని మోదీతో ఢిల్లీలో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మయ్యారు. సైఫ్ అలీఖాన్‌, క‌రీనా క‌పూర్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ త‌దిత‌రులు మోదీని క‌లిశారు. రాజ్ కపూర్ 100వ జయంతి స్మారకార్థంగా నిర్వహిస్తున్న RK Film Festivalలో పాల్గొనాల్సిందిగా వారు మోదీని ఆహ్వానించారు. 13 నుంచి 15 వ‌ర‌కు 3 రోజుల‌పాటు 40 న‌గ‌రాల్లో 10 రాజ్‌ కపూర్ చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

Similar News

News September 20, 2025

ఒకే ఏడాదిలో 34 సినిమాలు@ మోహన్‌లాల్

image

నటుడు <<17774717>>మోహన్ లాల్‌<<>>కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన 1978లో ‘తిరనోట్టం’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. 1986లో ఏకంగా 34 సినిమాల్లో నటించారు. నిర్మాత, గాయకుడిగానూ గుర్తింపు పొందారు. 2001లో పద్మశ్రీ, 2019లో పద్మభూషణ్ అవార్డులు ఆయన్ను వరించాయి. 2 సార్లు జాతీయ, 9 సార్లు కేరళ ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు. 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సైతం ఆయన నటనకు దాసోహమయ్యాయి.

News September 20, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* రూ.25.30 కోట్ల విలువజేసే 1858 కిలోల డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలను ధ్వంసం చేసిన సైబరాబాద్ పోలీసులు
* రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ ఆసుపత్రులలో లేదా అనుబంధంగా ఉన్న 115 ఫార్మసీల్లో అవకతవకలపై షోకాజ్ నోటీసులు జారీ చేసిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.
* ఈ నెలలో అదనంగా 1.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం ఆమోదం.
* ఈ నెల 23న మేడారానికి సీఎం రేవంత్

News September 20, 2025

తిరుమలను వాడుకోవడం CBN, లోకేశ్‌కు అలవాటు: YCP

image

AP: రాజకీయాల కోసం తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం CBN, <<17773731>>లోకేశ్‌<<>>కు అలవాటుగా మారిందని YCP మండిపడింది. ‘పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్‌ను పట్టుకున్నది 2023, APLలో. అంటే YCP హయాంలో. పోలీసులు విచారించడంతో అతని కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది రూ.14.43కోట్ల ఆస్తులను TTDకి గిఫ్టురూపంలో ఇచ్చేశారు. ఇది చట్టప్రకారం, కోర్టుల న్యాయసూత్రాల ప్రకారం జరిగింది’ అని ట్వీట్ చేసింది.