News October 28, 2024

హైకోర్టును ఆశ్రయించిన రాజ్ పాకాల

image

TG: జన్వాడ ఫామ్‌హౌస్ పార్టీ‌కి సంబంధించిన కేసులో రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు విచారణకు హాజరుకావాలంటూ రాయదుర్గం ఓరియన్ విల్లాలోని ఆయనకు చెందిన భవనానికి పోలీసులు నోటీసులు అంటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.

Similar News

News January 9, 2026

ట్రంప్ దెబ్బకు మార్కెట్ బేజారు.. భారీ నష్టాలు

image

భారత్‌పై 500% సుంకాలు విధించే ప్రపోజల్ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం తెలపడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 193 పాయింట్లు పడిపోయి 25,683 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 604 పాయింట్లు పతనమై 83,576 వద్ద ముగిసింది. దీంతో వరుసగా నాలుగోరోజు కూడా మార్కెట్ నష్టాలతో ముగిసింది. 2025 సెప్టెంబర్ తర్వాత ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి.

News January 9, 2026

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

image

ఉదయ్‌పూర్‌(RJ)లోని లీలా ప్యాలెస్‌ హోటల్‌కు కన్జూమర్ కోర్టు ₹10 లక్షల జరిమానా విధించింది. చెన్నైకి చెందిన దంపతులు వాష్‌రూమ్‌లో ఉన్న సమయంలో హోటల్ సిబ్బంది ‘మాస్టర్ కీ’తో గదిలోకి ప్రవేశించడమే దీనికి కారణం. వద్దని అరిచినా వినకుండా లోపలికి తొంగిచూసి ప్రైవసీకి భంగం కలిగించారని బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే ‘Do Not Disturb’ బోర్డు లేనందునే లోపలికి వెళ్లామని యాజమాన్యం వాదించినా కోర్టు ఏకీభవించలేదు.

News January 9, 2026

భూరికార్డులను ఎవరూ మార్చలేరు: చంద్రబాబు

image

AP: పాస్‌బుక్స్ పంపిణీ పవిత్రమైన కార్యక్రమమని CM చంద్రబాబు తెలిపారు. తూ.గో.జిల్లా రాయవరంలో ఆయన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ప్రాణం పోయినా రైతు భూమి కోల్పోయేందుకు అంగీకరించడు. సున్నితమైన అంశంతో పెట్టుకోవద్దని మాజీ CMకు చెప్పినా వినలేదు. కూటమి రాకపోయుంటే రైతుల భూములు గోవిందా గోవిందా. రాజముద్ర వేసి మళ్లీ పాస్‌బుక్స్ ఇస్తున్నాం. మీ భూరికార్డులను ఎవరూ మార్చలేరు. మోసం చేయలేరు’ అని స్పష్టం చేశారు.