News July 10, 2024
రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు: లావణ్య

హీరో రాజ్ తరుణ్‌తో అన్విక అనే పేరుతో కలిసున్నానని అతడి మాజీ ప్రేయసి లావణ్య తెలిపారు. ‘అదే పేరుతో విదేశాలకూ వెళ్లాం. కొన్నాళ్ల క్రితం రాజ్ నాకు అబార్షన్ చేయించాడు. ఆ మెడికల్ డాక్యుమెంట్లు పోలీసులకు అందించా. మాల్వీ వచ్చాక నన్ను దూరం పెట్టాడు’ అని నార్సింగి పోలీసులకు ఆమె మరోసారి ఫిర్యాదు చేశారు. అటు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ లావణ్యపై హీరోయిన్ మాల్వి ఫిల్మ్‌నగర్ PSలో కంప్లైంట్ చేశారు.
Similar News
News November 27, 2025
పెద్దపల్లి: ‘వంట సరుకులు ప్రభుత్వమే సరఫరా చేయాలి’

వంట సరుకులు ప్రభుత్వమే సరఫరా చేయాలని ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఎనిమిది రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెను బుధవారం ఆయన విరమింపజేశారు. అనంతరం పూసాల రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన ద్వితీయ మహాసభలో మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుంటే డిసెంబర్ లో సమ్మె చేస్తామన్నారు. సదానందం, సునీల్, లావణ్య కళావతి తదితరులు పాల్గొన్నారు.
News November 27, 2025
ఆ బంగ్లాను రబ్రీదేవి ఖాళీ చేయరు: RJD

RJD చీఫ్ లాలూ భార్య రబ్రీదేవి ఉంటున్న నివాసాన్ని ఆమె ఖాళీ చేయరని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఆ పార్టీ బిహార్ చీఫ్ మంగానీ లాల్ మండల్ తెలిపారు. జీవితకాల నివాసం కింద ఆ బంగ్లాను కేటాయించినట్లు చెప్పారు. పట్నాలోని అన్నే మార్గ్‌లో CM నివాసం ఎదుట రబ్రీదేవి, లాలూ 2 దశాబ్దాలుగా ఉంటున్నారు. కాగా దాన్ని ఖాళీ చేసి హార్డింజ్ రోడ్ 39 బంగ్లాకు మారాలంటూ ఇటీవల నితీశ్ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా RJD స్పందించింది.
News November 27, 2025
హైడ్రాపై కర్ణాటక బృందం ప్రశంసలు

TG: హైడ్రా (HYDRAA) చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించిన కర్ణాటక ప్రతినిధులు ఈ మోడల్‌ను బెంగళూరుతో పాటు ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా పేర్కొన్నారు. బతుకమ్మకుంట, నల్లచెరువు వంటి పునరుద్ధరించిన చెరువులను పరిశీలించారు. ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణలో హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశంసించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో జరిగిన చర్చలో దీని అమలు విధానం, విభాగాల సమన్వయం గురించి తెలుసుకున్నారు.


