News July 9, 2025

సామ్‌తో రాజ్.. శ్యామలి ఇంట్రెస్టింగ్ పోస్ట్

image

హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారనే పుకార్ల వేళ వీరిద్దరూ కలిసి ఉన్న <<17000941>>ఫొటో<<>> వైరలైన విషయం తెలిసిందే. ఈక్రమంలో రాజ్ సతీమణి శ్యామలి ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నారు. ‘ఏ మతమైనా మన చర్యలతో ఇతరులను బాధించొద్దని చెబుతుంది. అదే మనం పాటించాల్సిన గొప్ప నియమం’ అని రాసున్న కొటేషన్‌ను ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది.

Similar News

News August 30, 2025

డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన రద్దు?

image

మోదీ చైనాలో పర్యటిస్తున్న క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భారత్‌లో జరగబోయే క్వాడ్ సమ్మిట్‌కు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. దీనిపై ఇంకా ఇరు దేశాలు స్పందించలేదని పేర్కొంది. కాగా వచ్చే నవంబర్‌లో ఢిల్లీలో క్వాడ్ సదస్సు జరగనుంది. దీనికి ఆస్ట్రేలియా, జపాన్, యూఎస్ నేతలు హాజరు కావాల్సి ఉంది.

News August 30, 2025

HairFall: దువ్వెన ‘ఛేంజ్ చూడండి!

image

అందంలో భాగమైన కురులపై ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రాలిపోతున్నాయా? షాంపూలు, కండిషనర్స్, ఆయిల్స్ మార్చి అలిసిన అమ్మాయిలు ఒక్కసారి దువ్వెన మార్చి చూడండి. రెగ్యులర్ ప్లాస్టిక్ కోంబ్ పక్కనబెట్టి చెక్క దువ్వెనను పట్టుకోండి. చెక్క అయితే తలకు తాకడం లేదని అంటారు. కానీ అలా బలంగా తాకితే స్కాల్ప్‌పై ఉండే నేచురల్ ఆయిల్ పోతుంది. చెక్క స్మూత్‌తో కుదుళ్లపై తక్కువ ఒత్తిడితో వెంట్రుకలు రాలడం, చిట్లడం తగ్గుతుంది.

News August 30, 2025

ALERT.. కాసేపట్లో భారీ వర్షం

image

హైదరాబాద్‌లో రా.10 గంటల వరకు మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, షేక్‌పేట్, మణికొండ, నార్సింగి, టోలీచౌకీ తదితర ప్రాంతాల్లో వాన కురవొచ్చని తెలిపారు. హనుమకొండ, గద్వాల్, మేడ్చల్, నారాయణపేట్, వికారాబాద్, వనపర్తి, మహబూబ్‌నగర్, నల్గొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది.