News March 26, 2025

సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ మరోసారి సంచలన కామెంట్స్

image

TG: BRS హయాంలో తనపై PD యాక్ట్ పెట్టినప్పుడు కొందరు BJP నేతలే జైలుకు పంపాలని పోలీసులకు చెప్పారని BJP MLA రాజాసింగ్ ఆరోపించారు. ఇప్పుడూ కొందరు ఎలా వెన్నుపోటు పొడవాలో ఆలోచిస్తున్నారని వాపోయారు. ఇక తాము అధికారంలోకి వస్తే పోలీసులపై చర్యలుంటాయన్న KTR కామెంట్స్‌పై స్పందించారు. అప్పట్లో KTR ఆదేశాలతో రేవంత్‌ను బెడ్రూమ్‌లోకి వెళ్లి అరెస్ట్ చేశారని ఇప్పుడాయన CM అయినా వారిని ఏం చేయలేకపోతున్నట్లు చెప్పారు.

Similar News

News March 27, 2025

ఏషియన్ ఛాంపియన్‌షిప్స్.. భారత్‌కు మరో పతకం

image

జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరుగుతోన్న సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్-2025లో భారత్‌కు మరో మెడల్ దక్కింది. 97 కేజీల విభాగంలో రెజ్లర్ నితేశ్ కాంస్య పతకం గెలుచుకున్నారు. దీంతో భారత్ పతకాల సంఖ్య 2కు చేరింది. నిన్న 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ బ్రాంజ్ మెడల్ గెలిచిన సంగతి తెలిసిందే. నితేశ్ గతంలో U23 ఏషియన్ ఛాంపియన్‌షిప్స్, U23 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ పతకాలు సాధించారు.

News March 27, 2025

VIRAL.. అచ్చం కోహ్లీలా ఉన్న టీవీ నటుడు!

image

మనిషిని పోలిన మనుషులు ఉంటారని వింటుంటాం. స్టార్ క్రికెటర్ కోహ్లీని పోలిన ఓ వ్యక్తి తుర్కియేలో దర్శనమిచ్చారు. టీవీ యాక్టర్ సెటిన్ గునర్ అచ్చం కింగ్‌ను పోలి ఉన్నారు. ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అచ్చం కోహ్లీలా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. గతంలో పలువురు అభిమానులు కూడా కోహ్లీని పోలి ఉన్నట్లుగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

News March 27, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!