News March 15, 2025
రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

TG: గోషామహల్ BJP MLA రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో BJP అధికారంలోకి వస్తే MIM పార్టీ అధినేత అసుదుద్దీన్ ఒవైసీ దేశాన్ని వదిలిపోయేలా చేస్తానని హెచ్చరించారు. ‘లేదంటే BJPలో చేరతానని మా నేతల కాళ్లు పట్టుకునేలా చేస్తాను. హోలీ జరగనివ్వకూడదని, నగరంలో హింస సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. సీఎం రేవంత్ ఆయనకు మెంటల్ హాస్పిటల్లో చికిత్స ఇప్పించాలి’ అని సూచించారు.
Similar News
News March 15, 2025
22 రోజులైనా దొరకని కార్మికుల జాడ

TG: SLBC టన్నెల్‌లో కార్మికులు చిక్కుకుపోయి 22 రోజులైనా వారి జాడ తెలియడం లేదు. రోబోకు అనుసంధానంగా లిక్విడ్ రింగ్ వాక్యూమ్ ట్యాంక్ యంత్రంతో రెస్క్యూ చేపడుతున్నారు. D-2 ప్లేస్‌లో 4 మానవ అవశేషాలు ఉన్నట్లు GPR స్కానర్ చూపినా అక్కడ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దీంతో అక్కడ తవ్వకాలు నిలిపేసి హై రిస్క్ ఉన్న D-1 దగ్గర తవ్వకాలు జరపాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు ఒక మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే.
News March 15, 2025
పాక్‌లోని పంజాబ్‌లో బాలీవుడ్ పాటలపై బ్యాన్

బాలీవుడ్ పాటలపై పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ గవర్నమెంట్ నిషేధం విధించింది. ఈ పాటలను పాడడం, వినడం, డాన్స్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రావిన్స్‌లోని అన్ని కాలేజీలు, విద్యాసంస్థల్లో ఈ రూల్ వర్తిస్తుందని పేర్కొంది. దీనిని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పాకిస్థాన్‌కు చెందిన ఎక్కువమంది యువత బాలీవుడ్ సాంగ్స్‌కు డాన్స్ చేస్తారనే విషయం తెలిసిందే.
News March 15, 2025
20 ఏళ్ల తర్వాత మళ్లీ జహీర్ ఖాన్‌కు ‘ఐ లవ్ యూ’

ఎప్పుడో 20 ఏళ్ల క్రితం భారత పేస్ బౌలర్ జహీర్ ఖాన్‌కు లవ్ ప్రపోజ్ చేసిన యువతి మరోసారి వార్తల్లోకెక్కారు. లక్నో జట్టు మెంటార్‌గా ఉన్న జహీర్‌కు ఓ హోటల్లో మరోసారి అదే రీతిలో ప్రపోజ్ చేశారు. ‘జహీర్ ఐ లవ్ యూ’ అని పోస్టర్ ప్రదర్శించారు. ఈ ఫొటోను LSG షేర్ చేసింది. కాగా 2005లో టీవీఎస్ కప్ సిరీస్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా ఈ యువతి లవ్ ప్రపోజ్ చేసి వైరల్ అయ్యారు.