News June 27, 2024

‘కల్కి’పై రాజమౌళి కామెంట్స్

image

ఇవాళ థియేటర్లలో విడుదలైన ‘కల్కి’ మూవీపై దర్శకుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. కల్కి ప్రపంచం తనకెంతో నచ్చిందని, అద్భుతమైన టేకింగ్‌తో అదరగొట్టారన్నారు. ప్రభాస్ టైమింగ్ అదిరిపోయిందని, అమితాబ్, కమల్ హాసన్, దీపిక సపోర్ట్ అద్భుతమని పేర్కొన్నారు. చివరి 30 నిమిషాల సినిమా తనను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్, వైజయంతి టీమ్ అసాధారణ ప్రయత్నాన్ని అభినందించారు.

Similar News

News January 2, 2026

ఐఐటీ జమ్మూలో నాన్ టీచింగ్ పోస్టులు

image

<>ఐఐటీ <<>>జమ్మూ 27 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు జనవరి 3 నుంచి ఫిబ్రవరి 3వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజమ్), LLB/MBA, M.P.Ed/ B.P.Ed, ME, BE, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్, రాత పరీక్ష/ప్రొఫిషియెన్సీ టెస్ట్/ కంప్యూటర్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iitjammu.ac.in

News January 2, 2026

రేపు కొండగట్టుకు పవన్.. షెడ్యూల్ ఇదే!

image

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఉ.10.30 గంటలకు కొండగట్టుకు రానున్నారు. రూ.30.19 కోట్ల టీటీడీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆయనతో పాటు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఏపీ శాసనమండలి విప్ హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం కొడిమ్యాలలోని ఓ రిసార్టులో తెలంగాణ జనసేన నేతలతో పవన్ సమావేశం కానున్నారు.

News January 2, 2026

దాడికి సిద్ధం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

image

ఇరాన్‌లో పోలీసుల కాల్పుల్లో ఏడుగురు <<18737357>>నిరసనకారులు<<>> మరణించడంపై US అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై కాల్పులు జరపడం ఇరాన్‌కు అలవాటే. దానిని వెంటనే ఆపాలి. లేకుంటే అమెరికా జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. మేము లాక్ చేసి లోడ్ చేసుకుని దాడికి సిద్ధంగా ఉన్నాం’ అని పోస్ట్ చేశారు. ‘US జోక్యం చేసుకుంటే పరిస్థితులు ఉద్రిక్తంగా మారతాయి’ అని ఇరాన్ కౌంటరిచ్చింది.