News January 1, 2025

రేపే రాజమౌళి-మహేశ్ సినిమా లాంచ్!

image

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాను రేపు లాంచ్ చేయనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో ఉ.10 గంటలకు పూజా కార్యక్రమం జరగనుందని పేర్కొన్నాయి. RRR తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. హాలీవుడ్ రేంజ్‌లో ఈ మూవీని రూపొందించాలని జక్కన్న ప్లాన్ చేసినట్లు సమాచారం.

Similar News

News January 4, 2025

నేడు క్యాబినెట్ భేటీ.. రైతు భరోసా విధివిధానాలు ఖరారు?

image

TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రైతు భరోసా నిబంధనలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ విధివిధానాలను నేడు ఖరారు చేసే అవకాశముంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, భూమి లేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, సమగ్ర కులగణనపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

News January 4, 2025

పావురాలను మేపుతున్నారా.. ఈ ప్రమాదం తెలుసా?

image

చాలామందికి పావురాల్ని మేపడం ఓ హాబీగా ఉంటుంది. వారు వేసే మేత కోసం రోడ్డుపై, కరెంటు తీగలపై వందలాదిగా పావురాలు చేరుతుంటాయి. కానీ వాటి వల్ల తీవ్రస్థాయిలో శ్వాస సంబంధిత అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఉండే క్రిప్టోకోకస్ అనే ఫంగస్ కారణంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మెనింజైటిస్ వంటి వ్యాధులు వస్తాయని.. పలు రోగకారకాలకూ పావురాలు వాహకాలని పేర్కొంటున్నారు.

News January 4, 2025

అకౌంట్లోకి రూ.20,000.. ఎప్పుడంటే?

image

AP: కేరళ తరహాలో రాష్ట్రంలో కూడా హార్బర్లు, జెట్టీలు, ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారులకు వేట నిషేధం ప్రారంభానికి ముందే ఏప్రిల్ 1న వారి ఖాతాల్లో రూ.20,000 చొప్పున జమ చేస్తామని వెల్లడించారు. నిన్న ONGC పైపులైన్ వల్ల నష్టపోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల మత్స్యకారులకు ఆ సంస్థ విడుదల చేసిన నష్టపరిహారాన్ని 23,450 మందికి రూ.63,200 చొప్పున పంపిణీ చేశారు.