News April 11, 2025
‘ఆస్కార్’కు రాజమౌళి ధన్యవాదాలు

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో స్టంట్ డిజైన్ కేటగిరీని చేర్చడంపై డైరెక్టర్ రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. ‘ఎట్టకేలకు వందేళ్ల నిరీక్షణ తర్వాత. 2027లో విడుదలయ్యే చిత్రాలకు ఆస్కార్ డిజైన్ కేటగిరీని చేర్చడం సంతోషం. దీనిని సాధ్యం చేసినందుకు డేవిడ్ లీచ్, క్రిస్ ఓ హారా & స్టంట్ కమ్యూనిటీకి, అకాడమీ సీఈవో బిల్ క్రామెర్‌కు ధన్యవాదాలు. ఈ ప్రకనటలో RRR యాక్షన్ విజువల్ వాడటం చూసి ఆనందించా’ అని తెలిపారు.
Similar News
News April 18, 2025
UPI పేమెంట్స్‌పై GST.. క్లారిటీ

రూ.2వేలకు పైన చేసే UPI పేమెంట్స్‌పై కేంద్రం 18% GST విధించనున్నట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలపై కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. అవన్నీ నిరాధార, తప్పుదోవ పట్టించే వార్తలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమీ లేవని స్పష్టం చేసింది.
News April 18, 2025
మొక్కల ఆధారిత ప్రొటీన్లతో ఎక్కువ ఆయుర్దాయం

శరీరానికి విటమిన్లతో పాటు ప్రొటీన్లు చాలా అవసరం. వాటి కోసం మాంసాన్ని ఆశ్రయిస్తుంటాం. అయితే మొక్కల ఆధారిత(శనగలు, బఠానీలు, టోఫు) ప్రొటీన్లు తీసుకునే దేశాల్లో వయోజన ఆయుర్దాయం ఎక్కువని సిడ్నీ వర్సిటీ అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక వ్యాధులు, అకాల మరణాల ప్రమాదం తక్కువగా ఉంటుందని వెల్లడైంది. 1961-2018 మధ్య 101 దేశాల్లో ఆహార సరఫరా, జనాభా డేటా ఆధారంగా సైంటిస్టులు ఈ అధ్యయనం చేశారు.
News April 18, 2025
త్వరలో EPFO 3.0.. సేవలు సులభతరం: మాండవీయ

ఈపీఎఫ్‌వో చందాదారులకు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ శుభవార్త చెప్పారు. సేవలను సులభతరం చేసేందుకు అత్యాధునిక ఫీచర్లతో మే/జూన్‌కు EPFO 3.0ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆటో క్లెయిమ్, డిజిటల్ కరెక్షన్స్, ATM ద్వారా నగదు విత్‌డ్రా వంటి సదుపాయాలు ఉంటాయని వెల్లడించారు. క్లెయిమ్‌లు, కరెక్షన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగడం, ఫారాలు నింపడం వంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.