News April 19, 2024
రాజంపేట: పెద్దిరెడ్డి జోరును నల్లారి అడ్డుకోగలరా?

AP: రాజంపేట పార్లమెంటులో ఈసారి పోరు ఆసక్తికరంగా ఉండనుంది. పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి(YCP) హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తుండగా, మాజీ CM కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారి BJP తరఫున MPగా పోటీ చేస్తున్నారు. ఎవరికివారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2009 వరకు ఈ సీటు INCకి కంచుకోట. 11సార్లు ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. TDP, YCP చెరో రెండు సార్లు, ఓ సారి స్వతంత్ర పార్టీ విజయం సాధించింది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 9, 2025
ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలకు రామ్మోహన్ నాయుడు ఆదేశాలు

దేశంలోని మేజర్ ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేసి ఎయిర్‌లైన్ ఫంక్షనింగ్, ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ప్రయాణికులతో నేరుగా మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని చెప్పారు. డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారులు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై సహా మేజర్ ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు నిర్వహించనున్నారు.
News December 9, 2025
విజయ్ సభకు తుపాకీతో వచ్చిన వ్యక్తి!

కరూర్ తొక్కిసలాట తర్వాత TVK చీఫ్, నటుడు విజయ్ తొలిసారి ప్రజల మధ్యకు వస్తున్నారు. నేడు పుదుచ్చేరిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాలంలోని ఎక్స్పో గ్రౌండ్లో అధికారులు భద్రతా పరంగా భారీ ఏర్పాట్లు చేశారు. అయితే ఓ వ్యక్తి తుపాకీతో ప్రవేశించేందుకు యత్నిస్తూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతడు శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్‌గా గుర్తించారు.
News December 9, 2025
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్?

బ్లాక్‌బస్టర్ మూవీ ‘3 ఇడియట్స్’కు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని చర్చ జరుగుతోంది. ఈ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ 15 ఏళ్ల తర్వాత కలుసుకుంటే ఏం జరుగుతుందనే పాయింట్‌తో తెరకెక్కనుందని సమాచారం. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ‘3 ఇడియట్స్’లో ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.


