News April 22, 2025
‘రాజాసాబ్’ టీజర్ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాజాసాబ్’ Xలో ట్రెండవుతోంది. ఈ చిత్ర టీజర్ మేలో రాబోతున్నట్లు సినీవర్గాలు పేర్కొనడంతో అభిమానులు దీనిపై ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇండియన్ సినిమాలో ఇంతవరకూ చూడని విజువల్స్, VFXను టీజర్‌లో చూపించారని వార్తలొస్తున్నాయి. అయితే, టీజర్ కట్, సీజీ పనులు పూర్తయ్యాయని, ప్రభాస్ డబ్బింగ్ చెప్పడమే మిగిలి ఉందని సమాచారం.
Similar News
News April 22, 2025
BIG BREAKING: ఫలితాలు వచ్చేశాయ్

TG: ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు వచ్చేశాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తున్నారు. కాసేపట్లో Way2Newsలో రిజల్ట్స్ స్క్రీన్‌లో ఫలితాలు పొందవచ్చు. అందులో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు.
News April 22, 2025
BREAKING: ఫలితాలు ఆలస్యం

తెలంగాణ ఇంటర్ ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్యాహ్నం గం.12కు రిజల్ట్స్ ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటికే షెడ్యూల్ అయిన కార్యక్రమాల వల్ల ఆయన ఇంకా ఇంటర్ బోర్డుకు చేరుకోలేదు. కాసేపట్లో భట్టి వస్తారని తెలుస్తోంది.
Stay Tuned..
News April 22, 2025
అరెస్టుల్లో వేగం పెంచిన కూటమి ప్రభుత్వం

AP: అరెస్టుల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. తాజాగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ PSR ఆంజనేయులును అరెస్టు చేసింది. గత ప్రభుత్వంలో ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో ఆంజనేయులుపై పలు అభియోగాలు ఉన్నాయి. మరోవైపు మద్యం కేసులో రాజ్ కసిరెడ్డిని సిట్ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు రీఓపెన్ చేశారు.