News September 10, 2025
అక్టోబర్ 2న ‘రాజాసాబ్’ ట్రైలర్: నిర్మాత

అక్టోబర్ 2న విడుదలయ్యే ‘కాంతార: చాప్టర్-1’ సినిమాతో ‘రాజాసాబ్’ ట్రైలర్‌ను విడుదల చేస్తామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వెల్లడించారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న థియేటర్లలోకి రానుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. విశ్వప్రసాద్ నిర్మించిన ‘మిరాయ్’ ఈనెల 12న విడుదలవుతోంది.
Similar News
News September 10, 2025
అనంతపురం సభకు లోకేశ్ దూరం

AP: అనంతపురంలో ఇవాళ జరగనున్న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ సభకు మంత్రి నారా లోకేశ్ గైర్హాజరు కానున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను సురక్షితంగా తీసుకువచ్చే బాధ్యతను సీఎం చంద్రబాబు ఆయనకు అప్పగించారు. దీంతో లోకేశ్ వెలగపూడిలోని సచివాలయంలో కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. ఏపీ వాసులను క్షేమంగా రప్పించేందుకు కేంద్ర మంత్రులు, అధికారులతో సమన్వయం చేయనున్నారు.
News September 10, 2025
పాక్‌తో మ్యాచ్.. నెట్టింట విమర్శలు

ఆసియా కప్‌లో భాగంగా ఈనెల 14న భారత జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది. దాయాదితో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మ్యాచ్ ఆడేందుకు BCCI ఒప్పుకోవడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. తాజాగా ‘ఆట మొదలెడదామా’ అని గిల్ చేసిన ట్వీట్‌కు మాజీ ఆర్మీ ఆఫీసర్ ఇచ్చిన రిప్లై వైరలవుతోంది. ‘మన శత్రువు పాక్‌తో మ్యాచ్ ఆడే రోజు మీ ఆట అయిపోతుంది’ అని రిప్లై ఇచ్చారు. పహల్గామ్ అటాక్ మర్చిపోయారా? అంటూ నెటిజన్లు సైతం మండిపడుతున్నారు.
News September 10, 2025
ఇందిరమ్మ ఇళ్లు.. ఆధార్‌లో తప్పులు సరిదిద్దాలని ఆదేశాలు

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నగదు చెల్లింపులను ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ(APBS) ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే లబ్ధిదారుల్లో దాదాపు 30% మంది వివరాలు వారి ఆధార్ రికార్డులతో సరిపోలడం లేదని అధికారులు గుర్తించారు. దీని వల్ల పేమెంట్స్ ఆగుతాయని తెలిపారు. ఆధార్ వివరాల్లో తప్పులు ఉంటే వేగంగా సరిదిద్దాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ MD గౌతమ్ ఆదేశించారు.