News October 31, 2024

బట్లర్‌కు ఝలక్ ఇచ్చిన రాజస్థాన్‌

image

రాజస్థాన్ రాయల్స్ తమ రిటెన్షన్ జాబితాను ప్రవేశపెట్టింది. కెప్టెన్ సంజూ శాంసన్‌ (రూ.18 కోట్లు)తోపాటు యశస్వీ జైస్వాల్ (రూ.18 కోట్లు), రియాన్ పరాగ్ (రూ.14 కోట్లు), ధ్రువ్ జురేల్ (రూ.14 కోట్లు), హెట్మయర్ (రూ.11 కోట్లు), సందీప్ శర్మ (రూ.4 కోట్లు)లను రిటైన్ చేసుకుంది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ జోస్ బట్లర్‌ను వేలానికి వదిలేసింది.

Similar News

News October 30, 2025

వంటింటి చిట్కాలు

image

* బత్తాయి, నారింజ పండ్లను మైక్రోఓవెన్‌లో కొన్ని సెకన్ల పాటు ఉంచితే తొక్క సులభంగా వస్తుంది.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు లేదా బెల్లం వేస్తే కూర చేదు తగ్గుతుంది.
* అరటిపండ్లను ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెడితే నల్లగా మారవు.
* ఐస్ క్యూబ్స్ వేసిన నీళ్లలో ఉడికించిన బంగాళదుంపలు వేసి, తర్వాత తొక్కలు తీస్తే సులువుగా వస్తాయి.
* పోపు గింజలు వేయించి నిల్వ చేస్తే పాడవకుండా ఉంటాయి.

News October 30, 2025

నేటి నుంచి టెన్త్ పరీక్షల ఫీజు స్వీకరణ

image

TG: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు స్వీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు నవంబర్ 13 వరకు స్కూళ్ల HMలకు డబ్బు చెల్లించాలి. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, రూ.200తో డిసెంబర్ 11, రూ.500 ఎక్స్‌ట్రా ఫీజుతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చు. కాగా ఇంటర్ ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత మార్చి మూడో వారంలో పది పరీక్షలు జరిగే అవకాశం ఉంది.

News October 30, 2025

పంట నష్టం: నేటి నుంచి ఎన్యూమరేషన్

image

AP: మొంథా తుఫాను ధాటికి 1.23L హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 1.38L మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. నేటి నుంచి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్(లెక్కింపు) నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 4,576KM మేర రోడ్లు, 302చోట్ల కల్వర్టులు, వంతెనలు ధ్వంసమైనట్లు నిర్ధారించారు. వీటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.