News April 14, 2024
పాయింట్ల పట్టికలో టాప్ లేపుతున్న రాజస్థాన్

పంజాబ్‌పై గెలుపుతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం మరింత పదిలం చేసుకుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి ఐదు గెలిచింది. రెండో స్థానంలో కేకేఆర్, మూడో స్థానంలో చెన్నై, నాలుగో స్థానంలో లక్నో ఉన్నాయి. చెరో 6 పాయింట్లతో హైదరాబాద్, గుజరాత్ ఐదారు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో తలో 4 పాయింట్లతో ముంబై, ఢిల్లీ, పంజాబ్ నిలిచాయి. RCB ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
Similar News
News March 7, 2026
అమెరికాకు షాక్.. కీలక వ్యవస్థను ధ్వంసం చేసిన ఇరాన్!

అమెరికాకు ఇరాన్ షాకిచ్చింది. గల్ఫ్‌లో క్షిపణి రక్షణ వ్యవస్థలకు కీలకమైన రాడార్ సిస్టమ్‌ను దెబ్బతీసింది. <<14350576>>థాడ్(THAAD)<<>>లో ఉపయోగించే రాడార్ పరికరాలను ధ్వంసం చేసింది. జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి వైమానిక స్థావరంలో ఉన్న ఈ రాడార్ సిస్టమ్‌పై యుద్ధం ప్రారంభంలోనే దాడి జరిగిందని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. ఈ సిస్టమ్ విలువ $300M(₹2,760Cr) పైనే. ప్రపంచంలో USకు 8 థాడ్ వ్యవస్థలున్నాయి.
News March 7, 2026
ఈ కలర్ క్లాత్స్‌తో సమ్మర్‌లో హాయ్ హాయ్..!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటికి వెళ్లేవారు కొన్ని రంగుల దుస్తులకు ప్రయారిటీ ఇస్తే శరీరం చల్లగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తెలుపు, లైట్ బ్లూ, లైట్ గ్రే, సాఫ్ట్ పింక్, పేల్ గ్రీన్, లావెండర్, పౌడర్ బ్లూ, క్రీమ్ తదితర రంగుల దుస్తులు వాడాలని సూచిస్తున్నారు. ఇవి సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేసి తక్కువ వేడిని గ్రహిస్తాయి. అలాగే చెమటను త్వరగా ఆరేలా చేస్తాయి.
News March 7, 2026
త్వరలో ఎన్నికలు.. నిరుద్యోగులకు ₹1,500

త్వరలో అసెంబ్లీ ఎన్నికల వేళ WB CM మమతా బెనర్జీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ చెప్పారు. 10వ తరగతి పాసై ఖాళీగా ఉన్న 21 నుంచి 40 ఏళ్ల లోపు యువతీ యువకులకు నెలకు ₹1,500 చొప్పున భృతి ఇస్తామని ప్రకటించారు. మార్చి 7 నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు కోటి మందికి ఈ పథకం కింద ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 40% తగ్గిందని, లక్షలాది మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని ఆమె పేర్కొన్నారు.


