News December 10, 2024
పాక్‌లో తొలి హిందూ పోలీస్‌గా రాజేందర్

పాకిస్థాన్‌లో తొలి హిందూ పోలీస్ అధికారిగా రాజేందర్ మేఘ్వార్ నిలిచారు. సింధ్ ప్రావిన్స్‌లోని బదిన్‌కు చెందిన రాజేందర్ అక్కడి CSS(సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్)ఎగ్జామ్‌లో ఉత్తీర్ణులయ్యారు. ట్రైనింగ్ అనంతరం ఆయన ఫైసలాబాద్‌లో ASPగా బాధ్యతలు చేపట్టారు. రాజేందర్‌తోపాటు మైనారిటీ వర్గానికి చెందిన రూపమతి అనే యువతి CSS ఎగ్జామ్ క్లియర్ చేశారు. పాక్‌లోని మైనార్టీల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
Similar News
News September 22, 2025
రాష్ట్రంలో 1623 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్

<
News September 22, 2025
కనకదుర్గమ్మ చెంత 300 ఏళ్ల రావి చెట్టు

AP: విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో 300 ఏళ్ల రావి చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రోజూ వేలాది మంది భక్తులు అమ్మవారితోపాటు ఈ వృక్షానికి దండం పెట్టుకుని వెళతారు. సాధారణంగా హిందువులు రావి చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ వృక్షం దుర్గమ్మ చెంత ఉండటంతో విశిష్ఠత సంతరించుకుంది. కాగా ఇవాళ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల ఉత్సవాలు మొదలయ్యాయి.
News September 22, 2025
ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరిన వెండి ధర

వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ KG వెండిపై రూ.3000 పెరిగి రూ.1,48,000తో ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. 4 రోజుల్లోనే వెండి ధర రూ.7వేలు పెరగడం గమనార్హం. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.430 పెరిగి రూ.1,12,580కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.400 ఎగబాకి రూ.1,03,200 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.