News April 5, 2024
రజనీ మూవీ టైటిల్ ‘కళుగు’?

రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. మూవీ టైటిల్ను ఈ నెల 22న మేకర్స్ విడుదల చేయనున్నారు. కాగా చిత్రానికి ‘కళుగు’ అనే పేరును ఖరారు చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీనికి తెలుగులో ‘డేగ’ అని అర్థం. ఈ సినిమాలో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Similar News
News November 26, 2025
పెద్దపల్లిలో కుమారుడి కళ్లను దానం చేసిన తండ్రి

పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఫుట్బాల్ ఆడుతూ కిందపడి 10వ తరగతి విద్యార్థి కన్నవేన <<18394891>>ప్రతీక్<<>> మృతి చెందాడు. పెద్దపల్లి, కరీంనగర్ ఆసుపత్రులకు తరలించినా ఫలితం దక్కలేదు. తన కుమారుడు మరణించినా కళ్లు సజీవంగా ఉండాలని ప్రతీక్ తండ్రి కుమారస్వామి నిర్ణయించుకున్నారు. లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో ప్రతీక్ రెండు కళ్లను ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి దానం చేశారు.
News November 26, 2025
మూవీ అప్డేట్స్

* ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్కు ముందే కేవలం తెలుగు స్టేట్స్లోనే రూ.130కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
*నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్లో నటిస్తారని టాక్.
News November 26, 2025
iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.


