News April 4, 2025

రజినీకాంత్ కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్!

image

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’ మూవీని ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ‘కూలీ ఫ్రమ్ ఆగస్టు 14’ అన్న హాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతిహాసన్, పూజా హెగ్డే తదితరులు నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Similar News

News April 12, 2025

సెక్షన్-111 పెట్టడంపై జడ్జి ఆగ్రహం.. అసలేంటిది?

image

ఓ వ్యక్తిపై సెక్షన్ 111 కింద కేసు పెట్టాలంటే.. అతనిపై గత పదేళ్లలో ఒకటి కంటే ఎక్కువ ఛార్జిషీట్లు దాఖలై, వాటిలో ఒకదానినైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలి. BNSలోని సెక్షన్-111(1) వ్యవస్థీకృత నేరాన్ని సూచిస్తుంది. కిడ్నాప్, దొంగతనం, వాహనాల చోరీ, భూకబ్జా మొదలైన నేరాలు దీని కిందకు వస్తాయి. తాజాగా వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన <<16067210>>కిరణ్‌పై<<>> పోలీసులు ఈ కేసు పెట్టడంపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.

News April 12, 2025

రేపే రిజల్ట్స్.. ఆత్మహత్యలు వద్దు సోదరా!

image

సంవత్సరమంతా కష్టపడి చదివిన చదువుల ఫలితం రేపు తేలనుంది. ఉ.11 గంటలకు ఏపీ ఇంటర్ రిజల్ట్స్ రానున్నాయి. పిల్లలపై తల్లిదండ్రులకు అంచనాలు ఉండటం సహజం. కానీ ఫెయిల్ అయ్యారని, మార్కులు తక్కువ వచ్చాయని వాళ్లను తిట్టకండి. కనిపెంచిన మీరే వాళ్లపై నమ్మకం ఉంచి, ధైర్యం చెప్పకపోతే ఎలా? ప్రతికూల ఫలితాలు వచ్చినా భవిష్యత్తుపై నమ్మకం కలిగించండి. ఫెయిలైనంత మాత్రాన లైఫ్ ముగిసినట్టు కాదని పిల్లలూ గుర్తుంచుకోవాలి.
SHARE IT

News April 12, 2025

ధోనీపై తమిళ హీరో అసహనం

image

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపై తమిళ సినీ హీరో విష్ణు విశాల్ అసహనం వ్యక్తం చేశారు. ‘లోయర్ ఆర్డర్‌‌లో బ్యాటింగ్‌కు రావడం ఎందుకు? ఇదంతా ఓ సర్కస్‌లా ఉంది. స్పోర్ట్ కంటే ఎవరూ గొప్ప కాదు’ అని ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు పలువురు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. ఇవాళ KKRతో మ్యాచులో జట్టు కష్టాల్లో ఉండగా ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చారు. 4 బంతుల్లో ఒక్క రన్ మాత్రమే చేసి ఔటయ్యారు.

error: Content is protected !!