News September 4, 2025
OTTలోకి రజినీకాంత్ ‘కూలీ’.. ఎప్పుడంటే?

రజినీకాంత్ నటించిన ‘కూలీ’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 11 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగార్జున, శ్రుతిహాసన్, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News September 4, 2025
సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏం చేయాలంటే?

ఈనెల 7న సంభవించే <<17544453>>సంపూర్ణ చంద్రగ్రహణం<<>> సమయంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. గ్రహణం ఆదివారం రాత్రి 9.56గంటలకు మొదలై అర్ధరాత్రి 1.26 గంటల వరకు ఉండనుంది. ‘గర్భిణులు దర్భలను(గరిక) తమ దగ్గర పెట్టుకోవాలి. నిద్రించే స్థలంలోనూ ఉంచుకోవాలి. గ్రహణానికి ముందు, తర్వాత తల స్నానం చేయాలి. సాయంత్రం 6లోపు ఆహారం తినాలి. ఆహార వస్తువులు, పూజ గదిలో దర్భలను వేయాలి’ అని సూచిస్తున్నారు.
News September 4, 2025
ఒకటే క్లాస్: ఒకరి ఫీజు రూ.10లక్షలు.. మరొకరికి ఫ్రీ

రిజర్వేషన్ల కారణంగా ఒకే క్లాసులోని విద్యార్థులు వేర్వేరు ఫీజులు చెల్లించడాన్ని ఓ ప్రొఫెసర్ Xలో లేవనెత్తారు. పుణేలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలోని ఫస్ట్ ఇయర్ ఫీజు చార్టును ఆమె షేర్ చేశారు. ఇందులో ఓపెన్ కేటగిరీకి రూ.10L, EBC & OBC విద్యార్థులకి రూ.6 లక్షలు ఫీజు చెల్లించాలని ఉంది. అదే SC&ST వాళ్లకి ఎలాంటి ఫీజు లేదు. ‘ఇది సమానత్వం అనుకుంటారా?’ అని ట్వీట్ చేయగా వైరలవుతోంది.
News September 4, 2025
క్యాబినెట్ భేటీలో సుగాలి ప్రీతి కేసు ప్రస్తావన

AP: క్యాబినెట్ భేటీ సందర్భంగా సుగాలి ప్రీతి కేసు విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వ్యాఖ్యానించారు. అయితే ప్రీతి ఫ్యామిలీకి అండగా ఉన్నందుకు తనను టార్గెట్ చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా సీఎం దృష్టికి తెచ్చారు. కాగా అధికారంలోకి వచ్చాక పవన్ తన కూతురి కేసును పట్టించుకోవడం లేదని ఇటీవల ప్రీతి తల్లి ఆరోపించారు.