News October 4, 2024
అభిమానులకు రజినీకాంత్ సందేశం

సూపర్ స్టార్ రజినీకాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. తన కుటుంబసభ్యులు, సన్నిహితులు, సహచర నటులు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. మీ ప్రార్థనలే తనకు శ్రీరామరక్షగా నిలిచాయని పేర్కొన్నారు. కాగా రజినీ నటించిన ‘వేట్టయన్’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Similar News
News December 4, 2025
పొరపాటున కూడా వీటిని ఫ్రిజ్‌లో పెట్టకండి!

అధిక కాలం తాజాగా ఉంచడానికి చాలామంది ప్రతీ వస్తువును ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహారాలు.. డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, కాఫీ, నూనెలు, కుంకుమ పువ్వు, బ్రెడ్, క్యారెట్, అల్లం, ముల్లంగి, బంగాళదుంపలు. ఒకవేళ తప్పకుండా ఫ్రిజ్లోనే పెట్టాలి అనుకుంటే గాజు జార్లో ఉంచడం బెస్ట్.
News December 4, 2025
ఎయిడ్స్ నియంత్రణలో APకి ఫస్ట్ ర్యాంక్

AP: HIV నియంత్రణ, బాధితులకు వైద్యసేవలందించడంలో AP దేశంలో తొలి స్థానంలో నిలిచిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నిర్దేశిత 138 ప్రమాణాల్లో 105లో ఉత్తమ పనితీరు కనబరిచిందన్నారు. న్యాక్ త్రైమాసిక నివేదికలో రాష్ట్రం 2వ స్థానంలో ఉండగా అర్ధసంవత్సర ర్యాంకుల్లో ప్రథమ స్థానం సాధించినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల కన్నా ఉత్తమ పనితీరు కనబరిచిన ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
News December 4, 2025
PHOTO: 25 ఏళ్ల క్రితం పుతిన్‌తో మోదీ

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన వేళ 25 ఏళ్ల క్రితంనాటి ఓ ఫొటో వైరలవుతోంది. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయితో కలిసి గుజరాత్ సీఎం హోదాలో మోదీ మాస్కో పర్యటనకు వెళ్లారు. రెండు దేశాల అగ్రనేతల భేటీ సమయంలో.. అక్కడ మోదీ కూడా ఉన్న ఫొటో తాజాగా బయటకొచ్చింది. దీనిని చూస్తూ.. మోదీ, పుతిన్‌ల మధ్య ఉన్న స్నేహబంధం దాదాపు 25 ఏళ్ల నాటిదని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ బంధం ఇలాగే కొనసాగాలని కోరుతున్నారు.


