News October 5, 2025
రజినీ సింప్లిసిటీ.. రోడ్డు పక్కన నిల్చొని భోజనం!

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా హిమాలయాల సందర్శనకు వెళ్లారు. ‘జైలర్-2’ షూటింగ్‌కు వారం రోజులు తాత్కాలికంగా విరామం ఇచ్చి తీర్థయాత్రలకు వెళ్లారు. ప్రస్తుతం ఆయన రిషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో సేద తీరుతున్నారు. అక్కడ రోడ్డు పక్కనే సాధారణ వ్యక్తిలా భోజనం చేస్తున్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. రజినీ ఇప్పటికే బద్రీనాథ్ ఆలయం, బాబా గుహ వంటి పలు పవిత్ర స్థలాలను సందర్శించినట్లు తెలుస్తోంది.
Similar News
News October 5, 2025
118 APP పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(APP) పోస్టులకు <
News October 5, 2025
అమ్మ అవ్వాలనుకుంటే ఇలా సిద్ధంకండి

మాతృత్వం అనేది ఒక వరం. దీనికోసం ముందుగా శరీరాన్ని సిద్ధం చేసుకోవాలని, లేదంటే పుట్టే బిడ్డ పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఆహారంలో ఫోలిక్ యాసిడ్, మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ చేర్చుకోవాలి. అన్ని రకాల కూరగాయలు, పండ్లు, నట్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ డైట్‌లో ఉండేలా చూడాలి. ఆలివ్ ఆయిల్‌ను వాడితే గర్భాశయానికి రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది’ అని చెబుతున్నారు.
News October 5, 2025
ఇతిహాసాలు క్విజ్ – 26 సమాధానాలు

1. రాముడు సూర్య వంశానికి చెందినవాడు.
2. ఉత్తర, అభిమన్యుల కుమారుడు ‘పరీక్షిత్తు’.
3. విష్ణువు కాపలాదారులు జయవిజయులు.
4. కార్తికేయ స్వామికి 6 తలలుంటాయి.
5. హనుమాన్ చాలీసాను తులసీదాస్ రచించారు.
<<-se>>#IthihasaluQuiz<<>>