News March 17, 2025
‘రాజీవ్ యువవికాసం’ ప్రారంభం

TG: ‘రాజీవ్ యువవికాసం’ పథకాన్ని CM రేవంత్ ప్రారంభించారు. ఇందులో భాగంగా SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి రూ.6వేల కోట్ల రుణాలను 60-80% వరకు రాయితీతో ఇవ్వనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.4లక్షల వరకు మంజూరు కానుంది. దీని కోసం APR 5 వరకు దరఖాస్తుల స్వీకరణ, APR 6- మే 31 వరకు పరిశీలన చేయనున్నారు. జూన్ 2న రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది.
Similar News
News March 17, 2025
ఇంటికే భద్రాద్రి రామయ్య కళ్యాణ తలంబ్రాలు: TGSRTC

TG: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేర్చనున్నట్లు TGSRTC తెలిపింది. తలంబ్రాలు కావాల్సిన భక్తులు TGSRTC లాజిస్టిక్స్ కేంద్రాలు, సంస్థ వెబ్సైట్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది. సీతారాముల కళ్యాణం అయ్యాక తలంబ్రాలను హోం డెలివరీ చేస్తామని తెలిపింది. వివరాలకు 040-69440069, 040-69440000 నంబర్లలో సంప్రదించండి.
News March 17, 2025
రూ. లక్ష జీతంతో SBIలో ఉద్యోగాలు

రిటైల్ ప్రొడక్ట్స్ విభాగంలో 273 పోస్టుల భర్తీకి SBI దరఖాస్తులు కోరుతోంది. మేనేజర్ పోస్టులకు ఈ నెల 21, FLC కౌన్సెలర్/డైరెక్టర్ పోస్టులకు 26లోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. వయసు 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. MBA, PGDM, PGPM, MMS పాసై అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. sbi.co.inలో అప్లై చేయాలి. మేనేజర్కు రూ.85,920- రూ.1,05,280, FLC కౌన్సెలర్/డైరెక్టర్లకు రూ.50,000 ఇస్తారు.
News March 17, 2025
పూరీ దర్శకత్వంలో విజయ్ సేతుపతి సినిమా?

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ హీరో విజయ్ సేతుపతి కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. పూరీ చెప్పిన కథ సేతుపతిని మెప్పించిందని, సినిమా చేసేందుకు ఆయన అంగీకరించినట్లు పేర్కొన్నాయి. డిఫరెంట్ సబ్జెక్ట్ లేదా మంచి కమర్షియల్ కంటెంట్తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంతోనైనా పూరీ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.