News April 14, 2025
‘రాజీవ్ యువ వికాసం’.. నేడే చివరి తేదీ.. గడువు పొడిగిస్తారా?

TG: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అయితే వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు దరఖాస్తుదారులు చెబుతున్నారు. గడువును ఈనెలాఖరు వరకు లేదా మరో 10 రోజులపాటు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. ఇప్పటివరకు 14 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం.
Similar News
News December 10, 2025
వైద్య సహాయానికి రికార్డ్ స్థాయిలో CMRF నిధులు

TG: పేద, మధ్య తరగతి ప్రజల వైద్యానికి అందించే CMRF సహాయంలో రికార్డ్ నెలకొల్పినట్లు ప్రభుత్వం తెలిపింది. 2014-24 మధ్య కాలంలో ఏటా రూ.450Cr నిధులు కేటాయించగా గత రెండేళ్లలో ఏటా రూ.850Cr సహాయం అందించినట్లు ప్రకటించింది. ఈ రెండేళ్లలో 3,76,373 మంది లబ్ధిదారులకు రూ.1,685.79Cr పంపిణీ చేసినట్లు పేర్కొంది. LOCల ద్వారా రూ.533.69Cr, రీయింబర్స్మెంట్ ద్వారా రూ.1,152.10Cr పంపిణీ చేసినట్లు తెలిపింది.
News December 10, 2025
వివేకా హత్యకేసులో కోర్టు కీలక ఆదేశాలు

TG: వివేకా హత్యకేసులో పలు అంశాలపై రీ ఇన్వెస్టిగేషన్ చేయాలని CBIని నాంపల్లి కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు డైరెక్షన్లో కేసును మళ్లీ విచారించాలని సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణకు కోర్టు అనుమతులు ఇచ్చింది. A2 సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి కాల్ రికార్డింగుల ఆధారంగా దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.
News December 10, 2025
టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ మార్చాలి.. TSUTF డిమాండ్

TG: నిన్న విద్యాశాఖ ప్రకటించిన పదో తరగతి ఎగ్జామ్స్ <<18515127>>షెడ్యూల్పై<<>> తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(TSUTF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 7 పేపర్లను 35 రోజుల పాటు నిర్వహించడం సరికాదంది. అశాస్త్రీయంగా రూపొందించిన SSC టైమ్ టేబుల్ను వెంటనే మార్చాలని డిమాండ్ చేసింది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.


