News September 17, 2025

తెలంగాణ విమోచన వేడుకల్లో రాజ్ నాథ్ సింగ్

image

TG: హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై.. జాతీయ జెండాను ఎగుర వేస్తారు. ఆయన నిన్న సాయంత్రమే ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Similar News

News January 31, 2026

కాలంలో విత్తనాలు కలలోనైనా పోయాలి

image

వ్యవసాయంలో విత్తనాలు చల్లడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. అది దాటిపోతే ఎంత కష్టపడినా పంట పండదు. కాబట్టి ఏవైనా అడ్డంకులు వచ్చినా లేదా ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పనిని అస్సలు విస్మరించకూడదు. అలాగే మన నిజ జీవితంలో కూడా మంచి అవకాశాలు వస్తుంటాయి. వాటిని మనం సకాలంలో అందిపుచ్చుకోవాలి. లేదంటే అవి చేయిదాటిపోయాక పశ్చాత్తాప పడాల్సి వస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.

News January 31, 2026

‘శని త్రయోదశి’ ఎందుకింత పుణ్యమైనది?

image

శనివారం, త్రయోదశి తిథి కలిసిన రోజును ‘శని త్రయోదశి’ అంటారు. శని దేవుడికి ఎంతో ప్రీతికరమైనది శనివారం. అలాగే ఈ వారానికి ఆయనే అధిపతి. అందుకే ఈ రోజుకు విశేష శక్తి ఉంటుంది. అలాగే త్రయోదశి శివుడికి ఇష్టం. శనివారం విష్ణువుకు ప్రీతికరమైనవి. ఈ కలయిక వల్ల శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. నేడు వీరికి ప్రత్యేక పూజలు చేస్తే ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.

News January 31, 2026

తిరుమల లడ్డూ వివాదం.. దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదు

image

AP: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో కొందరు తమ పార్టీ, నాయకులపై దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని DGPకి YCP ఫిర్యాదు చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాసింది. CBI సిట్ ఛార్జ్‌షీట్‌లోని అంశాలను తప్పుదోవ పట్టిస్తూ తమ పార్టీని నిందిస్తున్నారని పేర్కొంది. గుంటూరు, వినుకొండ, పిడుగురాళ్ల, దర్శితో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని వివరించింది.