News August 17, 2024
నెలాఖర్లో అమెరికాకు రాజ్‌నాథ్.. ఎందుకంటే

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ నెలాఖర్లో వాషింగ్టన్‌కు వెళ్తున్నారు. రష్యాలో PM మోదీ పర్యటించాక US స్వరం మార్చింది. అనేక అంశాల్లో భారత్‌కు అభ్యంతరాలు చెబుతోంది. దీంతో రాజ్‌నాథ్ 5 రోజుల పర్యటన కీలకంగా మారింది. తేజస్ ఫైటర్స్‌కు GE జెట్ ఇంజిన్ల ఆలస్యం, మేకిన్ ఇండియా గురించి ఆయన ఆయుధ కంపెనీలతో మాట్లాడతారు. అలాగే ఆయుధ డ్రోన్లు, మిస్సైళ్లు, బాంబులు, నావిగేషన్, సెన్సార్ సూట్స్ ప్రాజెక్టులపై చర్చిస్తారు.
Similar News
News September 18, 2025
రాహుల్ ఆరోపణలు నిరాధారం: ఈసీ

పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ చేసిన <<17748163>>ఆరోపణలు <<>>నిరాధారమని ఈసీ కొట్టిపారేసింది. ప్రజల ఓట్లు ఏ ఒక్కటి ఆన్‌లైన్ ద్వారా డిలీట్ చేయలేదని తెలిపింది. సంబంధిత వ్యక్తికి తెలియకుండా ఓట్లను తొలగించలేదని వెల్లడించింది. 2023లో అలంద్‌లో ఓట్లు డిలీట్ చేసేందుకు ప్రయత్నిస్తే FIR నమోదుచేశామని పేర్కొంది. అలంద్‌లో 2018లో బీజేపీ, 2023లో కాంగ్రెస్ గెలిచినట్లు తెలిపింది.
News September 18, 2025
లిక్కర్ స్కాం.. 20 చోట్ల ఈడీ తనిఖీలు

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో బోగస్ పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు చేసిన వారి సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
పాలు పితికే సమయంలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పాలు పితకడానికి ముందు గేదె/ఆవు పొదుగు, చనులను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పాలు పితికే వ్యక్తి చేతులకు గోళ్లు ఉండకూడదు. చేతులను బాగా కడుక్కొని పొడిగుడ్డతో తుడుచుకున్నాకే పాలు తీయాలి. పొగ తాగుతూ, మద్యం సేవించి పాలు పితక వద్దు. పాల మొదటి ధారల్లో సూక్ష్మక్రిములు ఉంటాయి. అందుకే వేరే పాత్ర లేదా నేలపై తొలుత పిండాలి. పాలను సేకరించే పాత్రలను శుభ్రంగా ఉంచకపోతే తీసిన పాలు త్వరగా చెడిపోతాయి.