News April 21, 2024

తగ్గిన రజనీ ఆస్తులు.. కారు లేని ఉపసభాపతి!

image

AP: ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం మంత్రి రజనీతో పాటు కుటుంబ సభ్యులవి కలిపి మొత్తం ఆస్తుల విలువ రూ.85.76కోట్లు. 2019లో రూ.129.62 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
➣విజయనగరం YCP MLA అభ్యర్థి, ఉపసభాపతి కోలగట్ల వీరభధ్రస్వామి కుటుంబ ఆస్తులు రూ.29.39 కోట్లు. ఆయన వద్ద సొంత వాహనం లేదు.
➣గన్నవరం YCP ఎమ్మెల్యే వంశీ మొత్తం రూ.172.36 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2014లో 72.50కోట్లు, 2019లో 69.08 కోట్లుగా ఉంది.

Similar News

News February 2, 2026

నాన్నకు ప్రేమతో.. కూతుళ్లు ఏం చేశారంటే?

image

కన్నతండ్రి జ్ఞాపకం కళ్లెదుటే ఉండాలని నల్గొండ జిల్లా కోతులారానికి చెందిన గౌరవతి, మమత తమ నాన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తమను కొడుకుల్లా పెంచి, కంటిపాపలా చూసుకున్న వీరమళ్ల నర్సింహ గతేడాది అనారోగ్యంతో మరణించారు. నవమాసాలు మోయకపోయినా, తమ జన్మకు కారణమైన నాన్నే దైవమని నమ్మిన ఆ కుమార్తెలు రూ.6 లక్షలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి తండ్రీకూతుళ్ల బంధానికి నిలువుటద్దంగా నిలిచారు.

News February 2, 2026

సరస్వతీ దేవి వీణాగానం కన్నా తీయనైంది..

image

లలితా దేవి కొలువులో సరస్వతీ దేవి తన వీణతో అమృతతుల్యమైన సంగీతాన్ని వినిపించగా, ముక్కోటి దేవతలు పరవశించిపోయారు. ఆ గానాన్ని మెచ్చిన లలితాంబిక ‘బాగుంది’ అని పలికింది. ఆ ఒక్క మాటలోని మాధుర్యం, తన వీణా స్వరాల కంటే మిన్నగా ఉందని గ్రహించిన సరస్వతి దేవి వినమ్రంగా తన వీణను పక్కన పెట్టేసింది. సాక్షాత్తు సంగీతానికి అధిదేవత అయిన సరస్వతి వీణ నాదాన్ని సైతం మించిపోయేంత కమ్మని కంఠస్వరం లలితా దేవిది.

News February 2, 2026

లోకేశ్ నన్ను హతమర్చాలని చూస్తున్నారు: జోగి

image

AP: రెడ్ బుక్ రాజ్యాంగంతో లోకేశ్ తనను మట్టుబెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేశ్ ఆరోపించారు. తనకు ఏదైనా జరిగితే ఆయనదే బాధ్యత అన్నారు. లోకేశ్ ఆదేశంతో MP చిన్ని రౌడీలతో నా ఇంటిపై దాడి చేయించారు. దాడికి ముందు TDP నేతలతో DCP, CI చర్చించారు. TDP గూండాలు ర్యాలీగా పెట్రోలు సీసాలు, కర్రలతో వస్తుంటే వారికి పోలీసులు ఎస్కార్ట్‌గా వచ్చారు. ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడక మానరు’ అని హెచ్చరించారు.