News August 19, 2024
రక్షాబంధన్: మగవాళ్లందరూ ఆలోచించాల్సిన విషయం!
ఆడకూతుళ్లపై అత్యాచారాలు మనసుల్ని కలచివేస్తున్నాయి. ఇలాంటి కష్టం మన ఆడపడుచుకే వస్తే ఎలా స్పందిస్తాం? తప్పుచేసిన వాడి తోలు ఒలిచేస్తాం. కానీ అలాంటి తప్పు జరిగే ఆస్కారం ఎందుకివ్వాలి? ఈ స్వేచ్ఛాభారతంలో ఆడపిల్లలు స్వతంత్రంగా, నిర్భయంగా తిరిగే సమాజాన్ని నిర్మించుకోలేమా? ప్రతి ఆడకూతురిని మన ఆడపడుచులా భావించి ఓ తోబుట్టువులా రక్షగా నిలవలేమా? ఈ ‘రక్షాబంధన్’కి మగవారందరూ ఆలోచించాల్సిన విషయమిది.
Similar News
News January 22, 2025
ఆ మూర్ఖులను కఠినంగా శిక్షించండి
పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో <<15226066>>మంటలొచ్చాయని<<>> వదంతులు సృష్టించిన మూర్ఖులను గుర్తించి కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంతంగా వెళ్తోన్న రైలులో మంటలు చెలరేగాయని ప్రాంక్ చేసి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేయడం వల్లే అన్యాయంగా 8 మంది చనిపోయారని మండిపడుతున్నారు. వదంతులు సృష్టించిన వారిని శిక్షించి, ఇంకోసారి ఎవరూ ఇలా చేయకుండా భయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
News January 22, 2025
ఆటో డ్రైవర్‌కు రూ.50,000?
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ తన ప్రాణాలు కాపాడిన ఆటో డ్రైవర్‌కు రూ.50 వేలు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. సరైన సమయంలో ఆస్పత్రికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 16న దొంగచేతిలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన ఈ హీరోను ఆటో డ్రైవర్ సమయానికి ఆసుపత్రికి చేర్చారు.
News January 22, 2025
జేడీయూ U టర్న్.. బీజేపీతోనే ఉన్నామని ప్రకటన
మణిపుర్‌లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు వచ్చిన వార్తలపై జేడీయూ స్పందించింది. సెంట్రల్ లీడర్‌షిప్‌కు తెలియకుండానే లోకల్ చీఫ్ క్షేత్రిమయుమ్ బిరేన్ సొంతంగా గవర్నర్‌కు లేఖరాశారని వివరణ ఇచ్చింది. క్రమశిక్షణా రాహిత్యం కింద వెంటనే అతడిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ తెలిపారు. తాము బీజేపీకే మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.