News November 15, 2024

ఖలిస్థానీలతో కలిసి ర్యాలీ.. పోలీసుకు కెనడా క్లీన్ చిట్

image

ఈ నెల 3న ఖలిస్థానీ వేర్పాటువాదులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఓ పోలీసు అధికారికి కెనడా సర్కారు క్లీన్ చిట్ ఇచ్చింది. బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంలోకి చొరబడిన నిరసనకారులు భక్తులపై దాడి చేశారు. వారితో వెళ్లిన పోలీసు అధికారి హరీందర్ సోహీని పోలీసు శాఖ సస్పెండ్ చేసింది. అయితే, ఆయన చట్టబద్ధంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో గుర్తించామని పేర్కొంటూ తాజాగా నిర్దోషిగా ప్రకటించింది.

Similar News

News November 7, 2025

జ్ఞానాన్ని అందించే గురువే విష్ణు దేవుడు

image

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిస్ఠాయ నమో నమః ||
ఈ శ్లోకం విష్ణు స్వరూపుడైన వేదవ్యాస మహర్షికి, జ్ఞానానికి నిలయమైన విష్ణుమూర్తికి నమస్కారాలు తెలియజేస్తుంది. మన జీవితంలో జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని అందించే గురువును విష్ణువుగా భావించి, గౌరవించాలి. అంకితభావంతో చదివితేనే ఉన్నతమైన వివేకం లభిస్తుందని దీని సారాంశం.
<<-se>>#VISHNUSAHASRASASOURABHAM<<>>

News November 7, 2025

విడుదలకు సిద్ధమవుతున్న వరి రకాలు

image

☛ M.T.U.1282: దీని పంటకాలం 120-125 రోజులు. మధ్యస్త సన్నగింజ రకం. చేనుపై పడిపోదు, అగ్గి తెగులును తట్టుకుంటుంది. గింజ రాలిక తక్కువ. దిగుబడి ఎకరాకు 2.8-3టన్నులు.
☛ M.T.U.1290: పంటకాలం 117-120 రోజులు. సన్నగింజ రకం. చేనుపై పడిపోదు. అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. చౌడునేలలకు అత్యంత అనుకూలం. సాధారణ భూమిలో ఎకరాకు 3 టన్నులు, చౌడు నేలల్లో ఎకరాకు 2-2.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఎగుమతులకు అనుకూలం.

News November 7, 2025

అమరావతి సిగలో మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్

image

ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అమరావతిలో భారీ క్వాంటమ్ కంప్యూటర్‌(1,200 క్యూబిట్ సామర్థ్యం)ను ఏర్పాటు చేయనుంది. రూ.1,772 కోట్ల పెట్టుబడికి సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం 4వేల చ.అ. విస్తీర్ణంలో భవనం అవసరముంటుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే IBM 133 క్యూబిట్, జపాన్‌కు చెందిన ఫుజిసు 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.