News April 16, 2025
రామ్‌చరణ్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో మూవీ?

రామ్‌చరణ్‌తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్‌తో సందీప్ ఓ మూవీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాను బన్నీ రిజెక్ట్ చేశారని, ఆ మూవీనే చరణ్‌తో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక రౌండ్ చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. చెర్రీ నటిస్తున్న ‘పెద్ది’, సందీప్ డైరెక్ట్ చేయాల్సిన ‘యానిమల్ పార్క్’ చిత్రాలు పూర్తయ్యాక ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్తుందని టాక్.
Similar News
News December 10, 2025
మొదలైన లారీల బంద్

TGలో లారీల టెస్టింగ్, ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటిస్తున్నామని తెలిపింది. 13ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్నెస్, టెస్టింగ్ కోసం రూ.12 వేలు వసూలు చేసేవారని, తాజాగా రూ.30వేలకు పెంచారని మండిపడ్డారు. అటు APలో లారీ ఓనర్ అసోసియేషన్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో అక్కడ బంద్ తాత్కాలికంగా వాయిదా పడింది.
News December 10, 2025
ఎండినవారికి ఇనుము తిండి

తీవ్రమైన ఆకలితో శరీరం బలహీనంగా, ఎండిపోయి ఉన్న వ్యక్తికి ఇనుము ముక్కలను ఆహారంగా ఇస్తే ఎలా ఉంటుంది? ఇనుము తినడానికి పనికిరాదు, అది వారికి బలం ఇవ్వదు సరికదా, ప్రాణం పోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు దానికి ఉపశమనం కలిగించే పరిష్కారాన్ని సూచించాలి, అంతే తప్ప ఆ పరిస్థితిని మరింత దిగజార్చే పరిష్కారాన్ని సూచించకూడదని తెలిపే సందర్భంలో ఈ సామెత వాడతారు.
News December 10, 2025
గణపతి స్తోత్రాన్ని ఎప్పుడు పఠించడం ఉత్తమం?

వినాయకుడి స్తోత్రాలు పఠించడానికి బుధవారం ఉత్తమ దినమని పండితులు చెబుతున్నారు. శుభ దినాలప్పుడు కూడా ప్రారంభించవచ్చని, సంకష్టహర చతుర్థి రోజున మొదలుపెట్టడం మరింత మేలని అంటున్నారు. ‘ప్రారంభించిన తర్వాత రోజూ పఠించడం చాలా ముఖ్యం. ఉదయాన్నే స్నానం చేసి, శుచిగా దీపారాధన చేసి, గణేశునికి కొంచెం గరిక, నైవేద్యాన్ని సమర్పించి స్తోత్రాన్ని పఠించాలి. చివరగా హారతి ఇచ్చి నమస్కరించుకోవాలి’ అని సూచిస్తున్నారు.


