News July 11, 2024
రూ.7.5 కోట్ల కారు కొన్న రామ్ చరణ్?
అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ముంబై వెళ్లిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త కారులో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇప్పటికే ఖరీదైన కార్లను కలిగి ఉన్న రామ్ చరణ్ ‘Rolls Royce Spectre’ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని విలువ ఏకంగా రూ.7.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పటికే తండ్రి చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయిస్ ఉంది.
Similar News
News January 19, 2025
kg చికెన్ ధర ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. HYDలో కేజీ స్కిన్ లెస్ ధర రూ.220-230గా ఉంది. అటు ఏపీలోని చాలా ప్రాంతాల్లో రూ.240 వరకు ఉంది. లైవ్ బర్డ్ కేజీ రేటు రూ.117గా కొనసాగుతోంది. 12 కోడిగుడ్ల రిటైల్ ధర రూ.70గా ఉంది.
News January 19, 2025
WK ఎంపికపై గంభీర్, రోహిత్ మధ్య డిబేట్?
ఛాంపియన్స్ ట్రోఫీ <<15185531>>జట్టు<<>> ఎంపిక సమయంలో హెడ్ కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య తీవ్ర చర్చ జరిగినట్లు తెలుస్తోంది. హార్దిక్‌ను వైస్ కెప్టెన్ చేయాలని, సెకండ్ వికెట్ కీపర్‌గా శాంసన్‌ను తీసుకోవాలని గంభీర్ సూచించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. కానీ VCగా గిల్, WKగా పంత్‌ను తీసుకోవడానికే చీఫ్ సెలక్టర్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ మొగ్గు చూపినట్లు తెలిపింది.
News January 19, 2025
రేషనలైజేషన్‌ను తప్పుబడుతోన్న ఉద్యోగ సంఘాలు
AP: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) చేపట్టాలన్న నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీని వల్ల ఉద్యోగులపై తీవ్రమైన పని భారం పెరిగే అవకాశం ఉందని తెలిపాయి. మల్టీపర్పస్ ఉద్యోగులు అనే పేరుతో వివిధ పనులకు సచివాలయ ఉద్యోగులను వినియోగించుకోవాలనుకోవడం సరికాదని పేర్కొన్నాయి.