News December 20, 2024
రామ్‌చరణ్‌కు దేశంలోనే అతి పెద్ద కటౌట్.. ఎక్కడంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ఆయన అభిమానులు దేశంలోనే అతిపెద్ద కటౌట్ నిర్మిస్తున్నారు. విజయవాడలోని బృందావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు ఈ కటౌట్‌ను ఆవిష్కరిస్తారు. కాగా ఇప్పటివరకు హీరో ప్రభాస్‌కు కట్టిన 230 అడుగుల కటౌటే దేశంలో అతి పెద్దదిగా ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ కటౌట్ అంతకుమించి ఉంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.
Similar News
News December 21, 2024
ప్రియాంక గాంధీ ఎన్నికను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్
ఇటీవల జరిగిన వయనాడ్ లోక్ సభ ఎన్నికలో ప్రియాంక గాంధీ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కోర్టులో పిటిషన్ వేశారు. నామినేషన్ సమయంలో ప్రియాంక తనతో పాటు తన కుటుంబ ఆస్థుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఓటర్లను మోసం చేసి గెలిచారని ఆరోపించారు. బై ఎలక్షన్లో ప్రియాంకకు 6.22లక్షల ఓట్లు రాగా, నవ్యకు 1.09లక్షల ఓట్లు పోలయ్యాయి.
News December 21, 2024
చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తే..
చలికాలంలో చాలామంది వేడి నీటితో స్నానం చేసేందుకే ఇష్టపడతారు. కానీ చన్నీటితో చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చన్నీటి స్నానం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కండరాలు బలంగా మారుతాయి. చర్మం మెరిసిపోతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గి రిలాక్స్ ఫీల్ అవుతారు. ఆరోగ్యం బాగాలేని వారు చల్లని నీటికి బదులు వేడి నీటితోనే స్నానం చేయడం బెటర్.
News December 21, 2024
నేడు అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించనున్నారు. అనంతగిరి మండలం బల్లగరువు(పినకోట పంచాయతీ)లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10:30 గంటలకు ఆయన బల్లగరువు ప్రాంతానికి చేరుకుంటారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.