News March 25, 2024
రామ్ చరణ్ RC17 అప్డేట్ వచ్చేసింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ సుకుమార్ కాంబో మరోసారి రిపీట్ కానుంది. సుక్కు డైరెక్షన్‌లో రామ్ చరణ్ తన 17వ సినిమా చేయనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
Similar News
News March 25, 2026
శాంతి చర్చలపై ట్రంప్‌కు ఇరాన్ షరతులు!

శాంతి చర్చలపై <<19470089>>ట్రంప్<<>> పెట్టిన షరతులకు కౌంటర్‌గా ఇరాన్ కూడా కండిషన్స్ పెట్టినట్లు సమాచారం. గల్ఫ్‌లోని US బేస్‌లు మూసివేయాలని, నష్టపరిహారం ఇవ్వాలని, ఈజిప్ట్ సూయజ్ కెనాల్ తరహాలోనే హార్ముజ్‌లో షిప్పుల రాకపోకలపై ఫీజు వసూలు చేసుకుంటామని, అన్ని ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేసింది. దీంతో పాటు మిస్సైల్ ప్రోగ్రామ్ ఆంక్షలు పెట్టొద్దని, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
News March 25, 2026
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1122 పాయింట్లు లాభ పడి 75,190కు చేరగా నిఫ్టీ 316 పాయింట్ల లాభంతో 23,272 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్‌లో ట్రెంట్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ సహా 12కుపైగా స్టాక్స్ 2%పైగా లాభాల్లో ఉన్నాయి. క్రూడ్ ధరలు తగ్గుతుండటం, యుద్ధంపై శాంతి చర్చలకు ప్రయత్నాలు జరగడం ఇందుకు ప్రధాన కారణాలు.
News March 25, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,760 పెరిగి రూ.1,46,670కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,450 ఎగబాకి రూ.1,34,450 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.10వేలు పెరిగి రూ.2,60,000గా ఉంది.


