News November 19, 2024
రామ్ చరణ్ అన్ని మతాల్ని గౌరవిస్తారు: ఉపాసన

అయ్యప్ప మాలధారణలో దర్గాకు వెళ్లడమేంటంటూ నటుడు రామ్ చరణ్‌పై నెట్టింట పలువురు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు ఆయన భార్య ఉపాసన ట్విటర్‌లో జవాబిచ్చారు. ‘విశ్వాసం అనేది అందర్నీ కలిపి ఉంచేదే తప్ప విడదీసేది కాదు. భారతీయులు అన్ని దారులూ దేవుడి వద్దకే అని భావించి గౌరవిస్తారు. మన బలం ఐక్యతలోనే ఉంది. రామ్ చరణ్ తన ధర్మాన్ని ఆచరిస్తూనే ఇతర మతాల్ని గౌరవిస్తారు’ అని స్పష్టం చేశారు.
Similar News
News January 21, 2026
గొర్రెల్లో బొబ్బ రోగం(అమ్మతల్లి)-లక్షణాలు

ఏడాదిలో ఏ కాలంలోనైనా, ఏ ప్రాంతాల్లో గొర్రెలకైనా సోకే అంటువ్యాధి. ఇది సోకిన గొర్రెలు ఆకస్మికంగా నీరసంగా మారతాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగి కళ్లు ఎర్రబడి నీరు కారతాయి. వ్యాధి సోకిన 1,2 రోజుల్లో గొర్రె శరీర భాగాలపై దద్దుర్లు ఏర్పడి క్రమేణా పెద్దవై, బొబ్బలుగా మారి చీము పట్టి నలుపు రంగులోకి మారతాయి. వ్యాధి తీవ్రత బట్టి సుమారు 20-30% గొర్రెలు మరణిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స అందించాలి.
News January 21, 2026
ట్రంప్ దెబ్బ.. ప్రపంచ స్టాక్ మార్కెట్లూ పతనం

US అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు గ్లోబల్ స్టాక్ మార్కెట్లూ భారీగా పతనమవుతున్నాయి. USకు చెందిన Dow 870(1.76%) పాయింట్లు, S&P 143(2%), Nasdaq 561(2.39%) పాయింట్లు నష్టపోయాయి. దీంతో నేడు నిక్కీ 283(0.53%-జపాన్), DAX 255(1%-జర్మనీ), తైవాన్ మార్కెట్లు 510(1.62%) పాయింట్లు కోల్పోయాయి. గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ కాలుదువ్వడం, టారిఫ్స్, ట్రేడ్ వార్ భయాలతో ప్రపంచ మార్కెట్లు నష్టాలు ఎదుర్కొంటున్నాయి.
News January 21, 2026
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: కవిత

TG: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఏ పార్టీకి మద్దతు కావాలంటే ఆ పార్టీకి తెలంగాణ జాగృతి సపోర్ట్ చేస్తుందని తెలిపారు. కాగా కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ప్రక్రియకు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉండటంతో పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అటు ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.


