News October 12, 2024
అలియా భట్ కుమార్తెకు రామ్ చరణ్ ‘ఏనుగు గిఫ్ట్’!

రామ్ చరణ్‌కు తనకు మధ్య చక్కటి స్నేహం ఉందని అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన కుమార్తె రాహా పేరు మీద ఓ అడవి ఏనుగును దత్తత తీసుకుని చెర్రీ దాని ఆలనాపాలనా చూస్తున్నారని ఆమె కొనియాడారు. దత్తతకు సూచనగా ఓ ఏనుగు బొమ్మను రాహాకు గిఫ్ట్‌గా పంపించారని, రాహా రోజూ ఆ ఏనుగుపైకెక్కి ఆడుకుంటుందని వివరించారు. చెర్రీ, అలియా కలిసి RRRలో జోడీగా నటించిన సంగతి తెలిసిందే.
Similar News
News February 3, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB-3, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.33 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.36 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.12 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.27 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 3, 2026
ఈ నెల 6న క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న క్వాంటం వ్యాలీకి ఈ నెల 6న శంకుస్థాపన జరగనుంది. దీని కోసం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో 50 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు.
News February 3, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


