News February 12, 2025

‘కిల్’ డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా?

image

బాలీవుడ్‌లో గత ఏడాది ‘కిల్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్. ఆయన తన తర్వాతి సినిమాను రామ్‌చరణ్‌తో చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News February 12, 2025

Stock Markets: లాభాలు నిలబెట్టుకోలేదు..

image

బెంచ్‌మార్క్ సూచీలు నేడు స్వల్పంగా నష్టపోయాయి. నిఫ్టీ 23,045 (-26), సెన్సెక్స్ 76,171 (-122) వద్ద ముగిశాయి. ఒకానొక దశలో నిఫ్టీ 200, సెన్సెక్స్ 600 Pts మేర నష్టపోయి మళ్లీ పుంజుకోవడం గమనార్హం. PSU బ్యాంకు, ఫైనాన్స్, మెటల్ సూచీలు ఎగిశాయి. ఆటో, ఐటీ, ఫార్మా, రియాల్టి, హెల్త్‌కేర్, O&G సూచీలు ఎరుపెక్కాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.

News February 12, 2025

శుభ్‌మన్ గిల్ ‘శతక’బాదుడు!

image

భారత స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో సెంచరీతో కదం తొక్కారు. 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇది ఆయనకు 7వ వన్డే సెంచరీ. ఈ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో గిల్ 87, 60 పరుగులతో రాణించిన సంగతి తెలిసిందే. కాగా.. భారత్ స్కోరు ప్రస్తుతం 206/2గా ఉంది. మరో ఎండ్‌లో శ్రేయస్ అయ్యర్ 43(36 బంతుల్లో) కూడా ధాటిగా ఆడుతున్నారు.

News February 12, 2025

ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. సిఫీకి లోకేశ్ ఆహ్వానం

image

AP: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సిఫీ టెక్నాలజీస్ ఎండీ రాజు వేగేశ్నను మంత్రి నారా లోకేశ్ కోరారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాజుతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో మెగా డేటా సెంటర్, కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై చర్చించారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి వివరించారు. ఏపీలో పెట్టుబడికి తాము సుముఖంగా ఉన్నట్లు రాజు లోకేశ్‌కు తెలిపారు.

error: Content is protected !!