News January 10, 2025
రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ పబ్లిక్ టాక్
‘గేమ్ ఛేంజర్’ బెన్‌ఫిట్ షోల సందడి మొదలైంది. మూవీ చూసినవారు IASగా చెర్రీ లుక్, యాక్టింగ్ అదిరిపోయాయని చెబుతున్నారు. ఇంటర్వెల్‌లో ఊహించని ట్విస్ట్ సెకండాఫ్‌పై మరింత హైప్ పెంచుతుందట. కమెడియన్లందరూ ఉన్నా కామెడీ లేకపోవడం మైనస్ అంటున్నారు. తమన్ BGM, SJ సూర్య, కియారా, అంజలి నటన బాగుందని చెబుతున్నారు. కాసేపట్లో WAY2NEWS రివ్యూ.
Similar News
News January 10, 2025
నేడు హైదరాబాద్‌లో ‘డాకు మహారాజ్’ ప్రీరిలీజ్ వేడుక
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో ఈవెంట్ నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిన్న అనంతపురంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉండగా తిరుపతి తొక్కిసలాటతో మేకర్స్ రద్దు చేశారు. ఈ క్రమంలో ఈవెంట్ దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
News January 10, 2025
విరాట్ కోహ్లీపై సంచలన ఆరోపణలు
యువరాజ్ సింగ్ ఇంటర్నేషనల్ కెరీర్ ముగియడానికి కోహ్లీనే కారణమని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన కామెంట్స్ చేశారు. ‘క్యాన్సర్ నుంచి కోలుకున్నాక యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావాలనుకున్నాడు. అప్పటి కెప్టెన్ కోహ్లీ ప్లేయర్ల ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్లకు పెద్దపీట వేసేవాడు. అందరూ తనలాగే ఉండాలనుకునేవాడు. 2 WCలు గెలిచిన, క్యాన్సర్ నుంచి కోలుకుని వచ్చిన యువీకి టైమ్ ఇవ్వలేదు’ అని తెలిపారు.
News January 10, 2025
మహా కుంభమేళాలో ఈ బాబాలు స్పెషల్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఈనెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనున్న విషయం తెలిసిందే. 12 పుష్కరాల తర్వాత జరగనుండటంతో అన్ని ప్రాంతాల నుంచి భక్తులు, సాధువులు, అఘోరాలు నదీ స్నానానికి వెళ్తున్నారు. అయితే, ఇందులో రోజుకు పది కప్పుల టీ తాగుతూ జీవనం సాగిస్తున్న ‘చాయ్ వాలే బాబా’, తలపై వరి, శనగ మొక్కలను పెంచుతున్న అనాజ్ వాలే బాబా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.