News August 30, 2024

రామ్ చరణ్ మూవీకి ‘విడుదలై-2’ గండం

image

శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే రోజున వెట్రిమారన్ ‘విడుదలై-2’ విడుదల కానుంది. పార్ట్-1కి మంచి టాక్ రావడంతో సెకండ్ పార్ట్‌పై అంచనాలు నెలకొన్నాయి. దీంతో రెండు సినిమాలు ఒకే రోజున వస్తే తమిళనాట చెర్రీ మూవీ కలెక్షన్లపై ప్రభావం పడుతుందని సినీవర్గాలు చెబుతున్నాయి.

Similar News

News December 25, 2025

Money Tip: జీతం పెరిగినా జేబు ఖాళీనా? ‘లైఫ్‌స్టైల్ క్రీప్‌’లో పడ్డట్టే!

image

ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరగడాన్ని ‘లైఫ్‌స్టైల్ క్రీప్’ అంటారు. జీతం పెరగ్గానే లగ్జరీ వస్తువులు కొనడం, ఖరీదైన అలవాట్లు చేసుకోవడం వల్ల పొదుపు తగ్గుతుంది. భవిష్యత్తు కోసం దాచుకోవాల్సిన సొమ్ము విలాసాలకే ఖర్చవుతుంది. ఈ మార్పు మనిషికి సంపదను దూరం చేస్తుంది. అనవసర ఖర్చులను నియంత్రించి, పెరిగిన ఆదాయాన్ని పెట్టుబడిగా మలచడం ముఖ్యం. అప్పుడే ఆర్థిక స్వేచ్ఛను సాధిస్తారు.

News December 25, 2025

పుణే పోరు: ఓటుకు కారు.. థాయిలాండ్ టూరు!

image

పుణే మున్సిపల్ ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను వరాల జల్లుతో ప్రలోభపెడుతున్నారు. థాయిలాండ్ ట్రిప్పులు, ఖరీదైన కార్లు, ప్లాట్లు, బంగారం వంటి ఆఫర్లు ఇస్తున్నారు. మహిళల కోసం చీరలు, కుట్టు మిషన్లు పంచుతున్నారు. క్రికెట్ టోర్నీలు పెట్టి నగదు బహుమతులు ప్రకటిస్తున్నారు. మరోవైపు సీట్ల సర్దుబాటుపై పవార్ వర్గాల మధ్య చర్చలు జరుగుతుంటే ఠాక్రే సోదరులు ఒక్కటవ్వడం మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

News December 25, 2025

ఆ దేశంలో 4 నెలలు క్రిస్మస్ వేడుకలు

image

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వారం నుంచి 10 రోజులు క్రిస్మస్ వేడుకలు చేసుకుంటారు. ఫిలిప్పీన్స్‌ దేశంలో మాత్రం సుమారు 4 నెలలు విందు వినోదాలతో సెలబ్రేషన్స్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 1న మొదలయ్యే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జనవరి మొదటి వారం (త్రీ కింగ్స్ డే) వరకు కొనసాగుతాయి. డిసెంబర్ 16-24 వరకు ‘సింబాంగ్ గబీ’ పేరుతో ప్రత్యేక ప్రార్థనలు చేసి, 24వ తేదీ అర్థరాత్రి ‘నోచే బ్యూనా’ విందుతో ఎంజాయ్ చేస్తారు.