News April 4, 2025
బుచ్చిబాబుకు రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్

డైరెక్టర్ బుచ్చిబాబుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. ఇటీవల 40వ బర్త్ డే జరుపుకున్న చరణ్.. జై శ్రీరామ్ అని రాసి ఉన్న ఆంజనేయస్వామి పాదుకలను డైరెక్టర్‌కు బహుమతిగా పంపారు. గిఫ్ట్ అందుకున్న బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్‌తో ‘పెద్ది’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News November 28, 2025
బతుకమ్మ కుంటపై HCకు హాజరవుతా: రంగనాథ్

TG: బతుకమ్మ కుంట వివాదంలో DEC 5వ తేదీలోపు కోర్టు ముందు హాజరు కావాలని, లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైడ్రా రంగనాథ్‌ను HC ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘నాపై ఇప్పటికే 30కి పైగా కేసులున్నాయి. కబ్జాదారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. లీగల్‌గా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చెరువులను అభివృద్ధి చేస్తాం. బతుకమ్మ కుంటపై కోర్టుకు హాజరై అన్ని విషయాలు వివరిస్తాం’ అని చెప్పారు.
News November 28, 2025
డ్రెస్సునో, లిప్‌స్టిక్‌నో నిందించొద్దు: ఐశ్వర్య రాయ్

వీధుల్లో మహిళలను వేధించే ఘటనలపై బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ స్పందించారు. డ్రెస్సింగ్ ఆధారంగా బాధితులనే నిందించడాన్ని తప్పుబట్టారు. ‘సమస్య కళ్లలోకి నేరుగా చూడండి. తల పైకి ఎత్తండి. మీ విలువను ఎప్పుడూ తగ్గించుకోకండి. మిమ్మల్ని మీరు అనుమానించకండి. మీ డ్రెస్సునో, మీరు పెట్టుకున్న లిప్‌స్టిక్‌నో నిందించవద్దు. వీధుల్లో ఎదురయ్యే వేధింపులు మీ తప్పు ఎన్నటికీ కాదు’ అని మహిళలకు ఆమె సూచించారు.
News November 28, 2025
కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా రాబట్టాలి: CBN

AP: TDP పార్లమెంటరీ పార్టీ భేటీలో సీఎం చంద్రబాబు ఎంపీలకు కీలక సూచనలు చేశారు. DEC 1 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రయోజనాలే ఎజెండాగా తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర అంశాలను ప్రస్తావించాలని MPలకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా రాబట్టాలన్నారు. ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావాలని, రైతు సమస్యల పరిష్కారం ముఖ్యమని CBN వివరించారు.


