News June 5, 2024
బీజేపీకి రాముడు గుణపాఠం చెప్పాడు: సీఎం రేవంత్

TG: రాముడి పేరు మీద ఓట్లు యాచించిన బీజేపీని రాముడు కూడా క్షమించలేదని సీఎం రేవంత్ అన్నారు. అందుకే అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఆ పార్టీ ఓడిపోయిందని గుర్తుచేశారు. ‘రాముడి తలంబ్రాల పేరు మీద ఓట్లు కొల్లగొట్టాలనుకున్న బీజేపీని ప్రజలు ఓడగొట్టారు. ఆ పార్టీ నేతలకు రాముడు గుణపాఠం చెప్పాడు. దేవుడి పేరు మీద రాజకీయాలు చేయొద్దు’ అని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
Similar News
News November 15, 2025
తండ్రయిన రాజ్కుమార్

బాలీవుడ్ స్టార్ కపుల్ రాజ్కుమార్ రావు-పత్రలేఖ తల్లిదండ్రులయ్యారు. ఇవాళ వారి నాలుగో వివాహ వార్షికోత్సవం రోజునే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్, పలువురు నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. 2010లో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రాజ్.. స్త్రీ2 చిత్రంతో ఇండస్ట్రీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. పత్రలేఖ కూడా పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించారు.
News November 15, 2025
ఊడ్చే యంత్రాల అద్దె ఖరీదు తెలిస్తే షాకే!

బెంగళూరు రోడ్లను ఊడ్చేందుకు స్వీపింగ్ యంత్రాలను మరిన్ని అందుబాటులో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 46 స్వీపింగ్ యంత్రాలను ఏడేళ్ల పాటు అద్దెకు తీసుకునేందుకు ఏకంగా రూ.613కోట్లను కేటాయించింది. శుభ్రతపై కర్ణాటక ప్రభుత్వ చొరవ అభినందనీయమే అయినా అంత డబ్బు అద్దెకు ఖర్చు చేయడంపై నెట్టింట విమర్శలొస్తున్నాయి. కొనుగోలు చేసినా ఇంత ఖర్చవదేమో.. ఎందుకంత డబ్బుల్రా బుజ్జీ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
News November 15, 2025
3 – 20వ వారం వరకు గొర్రె పిల్లలకు ఆహారం

☛ 3- 7 వారాల వరకు తల్లిపాలతో పాటుగా అధిక పోషక విలువలు కలిగి సులువుగా జీర్ణమయ్యే క్రీపు దాణాను.. పిల్లల శరీర బరువులో ఒకటిన్నర శాతానికి మించకుండా రోజూ అందించాలి. ఇలా చేస్తే 7 వారాలకు పిల్లలు కనీసం 12kgల బరువు పెరుగుతాయి.
☛ 8 నుంచి 20వ వారం వరకు పిల్లలకు మేతను T.M.R (టోటల్ మిక్స్డ్ రేషన్) రూపంలో అందించాలి. టి.ఎం.ఆర్తో పాటుగా గొర్రెలకు పరిశుభ్రమైన తాగు నీటిని అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం.


