News July 15, 2024
రామసేతు వంతెన నిజమే: ఇస్రో

భారత్, శ్రీలంకల మధ్య రామసేతు వంతెన నిజమేనని ఇస్రో తెలిపింది. అమెరికా శాటిలైట్ ఐస్‌శాట్-2 డేటా సాయంతో శాస్త్రవేత్తలు మ్యాప్‌ను విడుదల చేశారు. ఈ వంతెన పొడవు 29 కి.మీ, సముద్రగర్భం నుంచి 8 మీటర్ల ఎత్తు ఉన్నట్లు నిర్ధారించారు. తమిళనాడులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు విస్తరించి ఉంది. ప్రస్తుతం ఈ వంతెన 99.98 శాతం నీటిలో మునిగి ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Similar News
News December 13, 2025
AP గోదావరి నీటి మళ్లింపును అనుమతించొద్దు: ఉత్తమ్

TG: గోదావరి నీటి మళ్లింపునకు AP పోలవరం-బనకచర్ల/నల్లమలసాగర్ లింక్ పేరిట చేపట్టే ప్రాజెక్టును అధికారులు ఇవాల్యుయేషన్ చేయకుండా నిలువరించాలని కేంద్రం, CWCలను TG కోరింది. అలాగే కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు చర్యలనూ అడ్డుకోవాలంది. వీటిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జలశక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్, TGకి కృష్ణా నీటి కేటాయింపు తదితరాలపై సహకారాన్ని అభ్యర్థించారు.
News December 13, 2025
రామేశ్వరం కేఫ్‌లో కేటీఆర్, అఖిలేశ్

TG: హైదరాబాద్‌లో పర్యటిస్తున్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇవాళ రామేశ్వరం కేఫ్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. కేఫ్‌లో వారిద్దరూ టిఫిన్ చేశారు. ఈ ఫొటోలను కేటీఆర్ తన X ఖాతాలో షేర్ చేశారు. కాగా నిన్న హైదరాబాద్‌కు వచ్చిన అఖిలేశ్.. తొలుత సీఎం రేవంత్ రెడ్డితో, తర్వాత కేటీఆర్‌తో భేటీ అయ్యారు.
News December 13, 2025
మహిళలూ ఈ తప్పులు చేస్తున్నారా?

మహిళలు చేసే కొన్ని తప్పులు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు. 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఏడాదీ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, తక్కువ పండ్లు, కూరగాయలు తిన్నప్పుడు ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు లోపిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి తగ్గి HPV ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వీటితో పాటు గర్భధారణలో చేసే తప్పులు కూడా దీనికి కారణమంటున్నారు.


