News June 14, 2024

అహంకారులను రాముడు 241 వద్దే ఆపాడు: RSS నేత ఇంద్రేశ్

image

తన అహంభావం వల్ల బీజేపీ 241 సీట్లకే పరిమితమైందని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ ఘాటు విమర్శ చేశారు. అందుకే రాముడు ఆ పార్టీని తక్కువ సీట్లకు పరిమితం చేశాడని పేర్కొన్నారు. ఇండియా కూటమి రాముడికి వ్యతిరేకమని ఆరోపించారు. అందుకే వారు కూడా 234 సీట్లతో సరిపెట్టుకున్నట్లు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఇంద్రేశ్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

Similar News

News February 1, 2025

రేవంత్.. దమ్ముంటే HYD పేరు మార్చండి: బండి సంజయ్

image

TG: BJP ఆఫీసున్న వీధి పేరును గద్దర్ పేరిట మారుస్తానని CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘పద్మ అవార్డు ఇవ్వనందుకు ఓ వీధి పేరు మారుస్తానని CM అనడం చూస్తుంటే నవ్వొస్తోంది. గద్దర్‌పై కేసులు పెట్టింది, అవమానించింది కాంగ్రెస్ పార్టీయే. రేవంత్‌కు దమ్ముంటే ముందుగా HYD పేరును భాగ్యనగర్‌గా, NZB పేరును ఇందూరుగా, MBNR పేరును పాలమూరుగా మార్చాలి’ అని X వేదికగా సవాల్ విసిరారు.

News February 1, 2025

మెగాస్టార్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్?

image

సినిమాల్లో హీరోలను ఎలివేట్ చేయడంలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది. అలా యాక్షన్‌కు తగ్గట్లుగా ప్రేక్షకులను తమ BGMతో అలరించే సంగీత దర్శకుల్లో అనిరుధ్ ఒకరు. ఇప్పుడు ఆయన శ్రీకాంత్ ఓదెల-మెగాస్టార్ కాంబోలో వచ్చే సినిమాకు పనిచేయబోతున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను హీరో నాని నిర్మిస్తున్నారు.

News February 1, 2025

4 స్కీమ్స్‌.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి డబ్బులు

image

TG: గత నెల 26న ప్రారంభించిన 4 పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 3 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఇప్పటికే 563 గ్రామాల్లో ఈ స్కీమ్స్‌ను ప్రారంభించింది. మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.