News March 16, 2024
రామభద్రపురం: చెట్టు నుంచి జారిపడి వ్యక్తి మృతి

నాయుడువలస గ్రామానికి చెందిన M. నారాయణ రావు (46)చెట్టు మీద నుంచి జారిపడి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నారాయణ రావు హైదరాబాద్లో చక్కెర కర్మాగారంలో పనిచేస్తూ సెలవుపై సొంతూరు కొద్ది రోజుల ముందు వచ్చారు. ఈరోజు ఇంటివద్ద ఉన్న చింతచెట్టు కాయలు కోస్తుండగా కాలుజారి పడ్డాడు. గాయాలు కావడంతో అస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు హెచ్సీ సత్యనారాయణ తెలిపారు.
Similar News
News January 29, 2026
లెప్రసీపై అవగాహన తప్పనిసరి: డీఆర్వో

లెప్రసీ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని జిల్లా రెవెన్యూ అధికారి ఈ. మురళి తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ‘వివక్షతకు ముగింపు–గౌరవానికి పరిరక్షణ’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
News January 29, 2026
బాల్య వివాహం చేస్తే జైలు శిక్ష తప్పదు: కలెక్టర్

బాల్య వివాహాలు చేయడం లేదా ప్రోత్సహించడం నేరమని, అటువంటి వారికి రెండేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తామని విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి హెచ్చరించారు. గురువారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ప్రచార రథాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.
News January 29, 2026
మెట్టవలస సచివాలయం తనిఖీ చేసిన కలెక్టర్

బొబ్బిలి మండలంలోని మెట్టవలస సచివాలయం, రైతు సేవా కేంద్రం, వెల్ నెస్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరును పరిశీలించి, ఈకేవైసీ, ధాన్యం సేకరణ, వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ తనిఖీలో తహశీల్దార్ ఎం. శ్రీను తదితరులు పాల్గొన్నారు.


