News March 17, 2024
కర్నూలు పార్లమెంటు సీపీఐ అభ్యర్థిగా రామచంద్రయ్య

కర్నూలు పార్లమెంటు సీపీఐ అభ్యర్థిగా రామచంద్రయ్యను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆదివారం కర్నూలులో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అభ్యర్థిగా రామచంద్రయ్యను అధికారికంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఆస్పరి మండల కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.
Similar News
News February 6, 2026
లడ్డు వివాదంపై అసత్య ప్రచారాలు ఆపాలి: SV మోహన్ రెడ్డి

తిరుమల లడ్డు అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వివాదంగా మార్చడం తగదని కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. లడ్డులో జంతు కొవ్వు కలవలేదని దర్యాప్తు సంస్థల నివేదికలు స్పష్టం చేసినా, కూటమి నేతలు ఇంకా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు.
News February 6, 2026
ఈ నెల 17న కర్నూలు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన

కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఈ నెల 17న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు బి.క్రాంతి నాయుడు తెలిపారు. రాష్ట్రవ్యాప్త ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఉపాధి హామీ పథకం పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News February 6, 2026
ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత సీట్లు: డీఈవో

విద్యా హక్కు చట్టం ప్రకారం కర్నూలు జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు బలహీన వర్గాల పిల్లలకు కేటాయించినట్లు డీఈఓ సుధాకర్ తెలిపారు. అర్హులైన వారు ఈనెల 20 నుంచి మార్చి 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఆధార్ వివరాలతో cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఐబీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ వంటి అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లోనూ ఈ ప్రవేశాలు కల్పిస్తారు.


