News February 17, 2025

రంజాన్ మాసం: సా.4 గంటల వరకే ఆఫీస్

image

TG: రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వ ముస్లిం ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి 2 నుంచి 31 వరకు వారంతా సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి వెళ్లిపోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లకు ఇది వర్తించనుందని తెలిపింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఏపీలోనూ ముస్లిం ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది.

Similar News

News December 6, 2025

గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సు: CM

image

TG: భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో జరగబోయే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ పూర్తిగా ఆర్థిక సదస్సని సమీక్షలో CM రేవంత్ పేర్కొన్నారు. ఏర్పాట్లు, ప్రోగ్రాం షెడ్యూల్‌‌ను అధికారులు వివరించారు. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌‌లో ఈ గ్లోబల్ సమ్మిట్ విజయాన్ని ప్రదర్శించాలన్న ఆలోచనను CM వివరించారు. భవిష్యత్‌ వృద్ధి ప్రణాళికలను ప్రధానంగా చేర్చాలని, ఈ పత్రాన్ని ప్రజలకు డిజిటల్‌గా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

News December 6, 2025

భారత్‌లో మరో రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్!

image

రష్యా తయారుచేసిన రియాక్టర్లతో భారత్‌లో రెండో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించే అవకాశాలపై చర్చించినట్టు రెండు దేశాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని కేటాయించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపాయి. ప్రైవేట్ న్యూక్లియర్ ఆపరేటర్లకు అవకాశం ఇచ్చే సంస్కరణలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఇప్పటికే తమిళనాడు కూడంకుళంలో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన 2 రష్యన్‌ VVERలను భారత్ నిర్వహిస్తోంది.

News December 6, 2025

విమానానికి బాంబు బెదిరింపు.. తీవ్ర కలకలం

image

TG: ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. వెంటనే ఫ్లై‌ట్‌ను శంషాబాద్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేయగా దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. బాంబ్ స్క్వాడ్స్ ప్రయాణికులను దించేసి తనిఖీలు చేపట్టారు. ప్యాసింజర్లు లగేజ్‌ను ఎయిర్పోర్ట్ సిబ్బందికి హ్యాండోవర్ చేయాలని ఆదేశించారు. ఈ ఫ్లైట్‌లో పలువురు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.