News March 18, 2025

తెలంగాణ తదుపరి CSగా రామకృష్ణారావు?

image

TG: ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పదవీకాలం ఈ ఏప్రిల్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్‌గా కె.రామకృష్ణారావు పేరును ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 1980 బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం
ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రామకృష్ణారావు పదవీకాలం ఈ ఆగస్టుతో ముగియనుంది. ఈయన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 12 బడ్జెట్లను రూపొందించి రికార్డు సృష్టించారు.

Similar News

News March 18, 2025

అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ప్రారంభం

image

AP: అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాఫీ ఉత్పత్తులను పరిశీలించిన అనంతరం చంద్రబాబు స్వయంగా పవన్‌కు కాఫీ అందించారు. దీంతో అక్కడున్నవారంతా చిరునవ్వులు చిందించారు. కాగా <<15795599>>పార్లమెంటులోనూ<<>> అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటుకు ఆమోదం లభించింది.

News March 18, 2025

ఏప్రిల్ 11న ‘ఆదిత్య 369’ రీరిలీజ్!

image

సోషియో ఫాంటసీ చిత్రం ‘ఆదిత్య 369’ మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ, సింగీతం శ్రీనివాసరావు కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం 1991లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు పాత్రల్లో బాలకృష్ణ నటనను మరోసారి థియేటర్లలో ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా?

News March 18, 2025

విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు

image

AP: కాకినాడ పోర్టు షేర్ల బదలాయింపు వ్యవహారంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 25న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఈ నెల 12న ఆయన తొలిసారి విచారణకు హాజరయ్యారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!